చంద్రన్న ఓడిపోవాలని వెంకన్నకు మొక్కుతా.!

Updated By ManamWed, 06/13/2018 - 20:20
Motkupalli Narasimhulu Shocking Comments On Chandrababu

Motkupalli Narasimhulu Shocking Comments On Chandrababu

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై సీనియర్ నేత, టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మరోసారి తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. బుధవారం యాదాద్రి జిల్లా ఆలేరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. "నేను మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నాను.. అయినప్పటికీ తిరుమల మెట్లెక్కి 2019 ఎన్నికల్లో ప్రస్తుత సీఎం చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటాను. ఎన్టీఆర్ కుటుంబాన్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుదే. టీడీపీని నందమూరి కుటుంబానికి అప్పజెప్పాలి. లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారు. 

ఏపీ ప్రధాన ప్రతిపక్షనేత, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డితో నేను కుమ్మక్యయ్యానని నాపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని ఓడించమని నేనే స్వయంగా చెబుతాను. నా నియోజకవర్గ ప్రజల కోరిక మేరకు వచ్చే ఎన్నికల్లో ఆలేరు నుంచి నేను పోటీ చేస్తాను. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోంది చంద్రబాబు కాదని, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్" అని మోత్కుపల్లి మీడియాకు వివరించారు.

English Title
Motkupalli Narasimhulu Shocking Comments On Chandrababu




Related News