కుమార్తెను రేప్ చేశాడని.. దుమ్ముదులిపిన తల్లి!

Updated By ManamThu, 03/22/2018 - 12:31
Mother of a rape victim

Mother of a rape victim thrashed

ఇండోర్: దేశ వ్యాప్తంగా రోజురోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ‘అబల’ ఇంట్లో నుంచి బయటికి రావాలన్నా.. బయటి నుంచి ఇంటికి వెళ్లాలన్నా భయం.. భయం.. ఇలా చాలా ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతికేస్తున్నారు. ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ’అనే రీతిలో ఏ మూల నుంచి ఏ దుండగుడొచ్చి దాడిచేస్తాడో.. అఘాయిత్యానికి పాల్పడతాడో అంటూ మహిళలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి నిందితుల కోసం నిర్భయ లాంటి కఠిన చట్టాలొచ్చినా ప్రయోజనం మాత్రం శూన్యమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో.!

తాజాగా.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఘోరం జరిగింది. ఓ యువతిపై కామాంధుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. కన్నీరుమున్నీరైన యువతి తల్లిదండ్రులకు చెప్పడంతో తీవ్ర ఆగ్రహంతో స్థానికంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితురాలిని సమీప ఆస్పత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయిస్తున్నారు. అరెస్ట్ అయిన నిందితుడ్ని చూడగానే కన్నెర్రజేసిన యువతి తల్లి.. అతడ్ని పట్టుకుని చితకబాదింది.

బాధితుడి రెండు చెంపలు చెళ్లుమనిపించింది. భాషలో తిడుతూ దుమ్మురేపింది బాధితురాలి తల్లి. అయితే ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. పోలీసులు కూడా ఆమెకు ఎంత ఆవేశం ఉంటే ఇలా చేయాలి అంటూ ఆపే ప్రయత్నం చేయకుండా మిన్నకుండిపోయారు. అయితే పక్కనే ఉన్న కొందరు ఈ తతంగం.. అంతటినీ తమ ఫోన్లలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అంతేకాదు షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. బాధితురాలి తల్లిని మెచ్చుకుంటున్నారు. ‘సూపర్ ఆంటీ ప్రొసీడ్..’ అని కొందరు కామెంట్లు పెడుతున్నారు. కాగా ప్రస్తుతం నిందితుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడు.

 

English Title
Mother of a rape victim thrashed the accused while he was in police custody in Indore
Related News