రాజధానిలో ప్రాణ రక్షణ కరువు

delhi police
  • గతేడాది పెరిగిన హత్యలు 

  • నివేదిక విడుదల చేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రాణ రక్షణ కరువైంది. సాక్షాత్తూ అధికారిక నివేదికలే ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. రాజధాని ఢిల్లీలో గతేడాది జరిగిన నేరాల వివరాలను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు. రాజధానిలో ఘోరమైన నేరాల సంఖ్య గణనీయంగా త గ్గాయని, అరెస్టుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు. అల్లర్ల సంఖ్య కూడా కాస్త తగ్గుముఖం పట్టినట్టు, దొంగతనాలు, అత్యాచారాల వంటి ఘోరాలు కాస్త తగ్గుముఖం పట్టాయన్నారు. నగరంలో నివసిస్తున్న ఈశాన్య భారతీయులపై కూడా నేరాలు తగ్గినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

‘నేరాల రాజధాని’..
2017తో పోలిస్తే హస్తినలో హత్యల సంఖ్య పెరిగిందన్నారు.  2018లో 23 అల్లర్ల కేసులు నమోదయ్యాయి, 2017తో పోలిస్తే 54శాతం కేసులు తగ్గాయి, 2016తో పోలిస్తే వీటి సంఖ్య 70.89శాతం తగ్గడం విశేషమని హస్తిన పోలీసులు మీడియాకు వివరించారు. దొంగతనాల విషయానికి వస్తే 2,307 కేసులు నమోదు కాగా 2017తో పోలిస్తే ఇది 20.15శాతం తక్కువ. అయితే హత్యల సంఖ్య ఏకంగా 3.25శాతం పెరిగాయి. 2017లో 462 హత్యా కేసులు నమోదు కాగా 2018లో 477 కేసులు నమోదయ్యాయి. 2017తో పోలిస్తే 0.78శాతం తక్కువ అత్యాచార కేసులు నమోదయ్యాయి. మరోవైపు గత మూడేళ్లుగా అరెస్టుల సంఖ్య బాగా పెరిగిందని, దొంగతనం, హత్య, అత్యాచారాలు వంటి పలు నేరారోపణలపై గతేడాది మొత్తం 91,291 అరెస్టులు జరిగాయన్నారు. 2017లో 84,999 అరెస్టులు జరిగాయ న్నారు. అన్ని మెట్రో నగరాలతో పోలిస్తే ఢిల్లీలో మొదటి నుంచి నేరాల సంఖ్య ఎక్కువే. ఈ కారణంగా ‘నేరాల రాజధాని’గా అపప్రధ మూటగ ట్టుకుంది. అయితే నేరస్థులపై నేరారోపణలే తప్పితే పెద్దగా నేరం రుజువైన సందర్భాలు కూడా ఇక్కడ తక్కువగా ఉండడం హైలైట్. నేరారోపణలు ఎదుర్కొంటున్న అత్యధికులు నిర్దోషులుగా విడుదలవు తుండడంపై దృష్టిసారించాలని నగర పోలీసులకు ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ అనిల్ బైజల్ గతేడాది సూచించారు. హస్తినలోని 30 పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించినట్టు, ఇందులో భాగంగా సుశిక్షుతులైన సిబ్బంది నేరాలపై దర్యాప్తు చేస్తుందన్నారు. విచారణ, దోషిత్వాన్ని రుజువు చేయడం, సకాలంలో క్రిమినల్ కేసులపై విచారణ జరిగేలా నాణ్యవంతమైన సేవలు వీరు అందించనున్నారు.  

సంబంధిత వార్తలు