మోదీకి భయం మొదలైంది

Rahul gandhi
  • అందుకే సీబీఐ చీఫ్‌ను సాగనంపారు

  • కాంగ్రెస్ అధినేత రాహుల్ విమర్శలు

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్‌వర్మను తప్పించాలని మోదీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ నిర్ణయించడాన్ని ఆయన తప్పుబట్టారు. తన సొంత అబద్ధాలకు బందీ అయ్యారంటూ మోదీని విమర్శించారు. రఫేల్ ఫైటర్ జెట్ విమానా కొనుగోలు ఒప్పందంలో జరిగిన అవినీతి గురించిన భయం మోదీ మదిలో తిరుగుతోందని, అందుకే దానిపై దర్యాప్తు చేస్తున్న అధికారిని తప్పించారని అన్నారు. భారత వైమానిక దళం నుంచి రూ. 30 వేల కోట్లు దొంగిలించి అనిల్ అంబానీకి ఇచ్చారని, ఇప్పుడు వరుసగా రెండోసారి సీబీఐ చీఫ్ పదవి నుంచి అలోక్‌వర్మను తప్పించడం ద్వారా ఆయన ఇప్పుడు తన సొంత అబద్ధాలకు ఖైదీ అని నిరూపితమైందని ట్వీట్ చేశారు. చివరలో సత్యమేవ జయతే అని కూడా ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. గత అక్టోబరు నెలలో అర్ధరాత్రి సమయంలో సీబీఐ చీఫ్ పదవినుంచి అలోక్‌వర్మను తప్పించారని, అసలు వర్మపై ఉన్న అవినీతి ఆరోపణలు ఏవీ నిరూపితం కాకముందే అలా చేశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. రఫేల్ డీల్ గురించి ఆయన విచారణ మొదలుపెట్టడం వల్లే తప్పించారని అన్నారు. 

సంబంధిత వార్తలు