వారసత్వ రాజకీయాలకు ముగింపు

Updated By ManamSun, 05/27/2018 - 01:23
amit
  • చరమగీతం పాడినమోదీ ప్రభుత్వం

  • అభివృద్ధి రాజకీయాలకు నాంది

  • వచ్చే ఎన్నికల్లో విజయం మాదే.. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు

  • 2019లో మోదీ, ఆయన వ్యతిరేకుల మధ్యే పోటీ

  • పెట్రోల్, డీజిల్ ధరలకు త్వరలో దీర్ఘకాలిక పరిష్కారం: అమిత్ షా

sha bjpన్యూఢిల్లీ : దేశంలో వారసత్వ రాజకీయాలకు నరేంద్రమోదీ ప్రభుత్వం చరమగీతం పాడిందని, అభివృద్ధి అజెండా ప్రజల్లోకి తీసుకెళ్లిందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. కుటుంబ, కుల రాజకీయాలకు ముగింపు పలికి.. అభివృద్ధి రాజకీయాలకు నాంది పలికారని ప్రధాని ఆయన అంటూ ప్రశంసలు కురిపించారు. మోదీ అధికార పగ్గాలు చేపట్టి శనివారంతో నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఒకే ర్యాంకు ఒకే పింఛను(ఓఆర్‌ఓపీ) సమస్యను మోదీ ప్రభుత్వం పరిష్క రించిందని చెప్పారు. అవినీతిని అడ్డు కునేందుకు ఆయన తీసుకున్న సంస్కరణలు సత్ఫలితాలనిచ్చా యని, నల్లధనం నిర్మూలను సిట్‌ను నియమించారని వివరిం చారు. ప్రధాని మోదీ గ్రామీ ణాభివృద్ధికి కట్టుబడి ఆ దిశగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అత్యంత కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని బీజేపీ దేశానికి అందించిందని, ఇందుకు తామెంతో గర్విస్తున్నామని అన్నారు.

2016లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌తో దేశ రక్షణ విషయంలో ఉన్న నిబద్ధతను చాటుకున్నా మని షా చెప్పారు. ‘యుద్ధాన్ని బీజేపీ చివరి అవకాశంగా భావిస్తుంది. ఎటువంటి రక్తపాతం జరగకుండా సరిహద్దులు సురక్షితంగా ఉండాలనే మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీ హయాంలో ఎక్కువ మంది ఉగ్రవాదులు హతమయ్యారు’ అని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతమున్న పెట్రోల్, డీజిల్ ధరలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడేళ్ల పాటు ఉన్నాయి. కానీ, ఇప్పుడు మాత్రం కేవలం కొద్ది రోజులు ఇంధన ధరలు పెరిగిపోతేనే వాళ్లు విసిగిపోతున్నారా? ఇంధన ధరల తగ్గింపు విషయంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనికి దీర్ఘకాల పరిష్కారం కోసం మోదీ సర్కారు ప్రయత్నిస్తోంది. అది త్వరలోనే సాకారమవుతుంది’ అని అమిత్ షా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమని, ఇందులో ఎలాంటి సంశయాలు అక్కర్లేదని పేర్కొన్నారు. 2019లో ఎన్నికలు మోదీ వర్సెస్ మోదీ హటావో బ్రిగేడ్ మధ్య జరుగుతాయని పేర్కొన్నారు. 


స్కామ్ రహితంగా మోదీ పాలన: అరుణ్ జైట్లీ
గడిచిన నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ స్కామ్ రహిత పరిపాలనను అందించారని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇతర దేశాలకు మార్కెట్‌గా ఉన్న స్థాయి నుంచి భారత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రత్యేక స్థానంతో వెలిగిపోతోందని ఆయన పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా జైట్లీ ఫేస్‌బుక్ పోస్టు ద్వారా తమ ప్రభుత్వ విజయాలను వెల్లడించారు. తమకు ముందు పదేళ్లు పరిపాలించిన యూపీఏ ప్రభుత్వం దేశ స్వాతంత్య్రం తర్వాత వచ్చిన అత్యంత అవినీతి ప్రభుత్వమంటూ ఆయన మండిపడ్డారు. సవాళ్లు ఎదురైన సమయంలో యూపీఏ ప్రభుత్వం చతికిలపడిందని, కానీ 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమించి భారత ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. 

English Title
modi ends Hereditary politics
Related News