కుమారకు మోదీ సవాల్.. మోదీకి కుమారస్వామి రిప్లై

Updated By ManamWed, 06/13/2018 - 12:49
Modi Challenges Kumaraswamy Here What Kumaraswamy Says

Modi Challenges Kumaraswamy Here What Kumaraswamy Saysన్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి సవాల్ విసిరారు. అయితే, అదేదో రాజకీయ సవాల్ కాదు లెండి. ఫిట్‌నెస్ సవాల్ అది. ఇటీవలే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ప్రధాని మోదీకి ఫిట్‌నెస్ చాలెంజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది కాస్తా చైన్‌లా అందరికీ పాకేసింది. తాజాగా తాను వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. కర్ణాటక సీఎం కుమార స్వామి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రాకు తాజా ఫిట్‌నెస్ సవాల్ విసిరారు. దానికి కుమార స్వామి దీటైన బదులు కూడా ఇచ్చారు.

‘‘కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారుస్వామి, కామన్‌వెల్త్ గేమ్స్ 2018లో భారత్‌కు పతకాల మోత మోగించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా, 40 ఏళ్లు దాటిన సాహస ఐపీఎస్ అధికారులకు #FitnessChallenge’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా ఫిట్‌నెస్ చాలెంజ్ ఇచ్చారు.

దానికి స్పందించిన కుమారస్వామి.. కాస్తంత కఠువుగానే బదులిచ్చారు. ‘‘ప్రియమైన ప్రధాని నరేంద్ర మోదీ గారూ.. నాపై, నా ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నందుకు గౌరవంగానూ, ఆనందంగానూ ఉంది. నిజమే.. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక శ్రమ తప్పనిసరి. నేను రోజూ యోగా, ట్రెడ్‌మిల్ చేస్తుంటా. కానీ, అంతకుమించి ఆందోళన నా రాష్ట్రం గురించే. నా రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్ర ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. కాబట్టి మా రాష్ట్ర ఫిట్‌నెస్‌కు మీ మద్దతు, సాయం చాలా అవసరం’’ అంటూ ట్వీట్ చేశారు కుమార స్వామి. 

English Title
Modi Challenges Kumaraswamy Here What Kumaraswamy Says
Related News