వైఎస్ జగన్ ఫ్లెక్సీలో బాలకృష్ణ ఫొటో..!

Updated By ManamMon, 06/11/2018 - 11:10
MLA Balakrishna Photo, Ys jagan mohan reddy, YSRCP Flex banner

MLA Balakrishna Photo, Ys jagan mohan reddy, YSRCP Flex bannerఏలూరు: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 186వ రోజు ప్రజాసంకల్పయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ప్రస్తుతం కొవ్వూరులో కొనసాగుతోంది. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగా వైసీపీ కార్యకర్త ఒకరు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశమైంది. మల్లవరానికి చెందిన ఓ కార్యకర్త జగన్‌ పాదయాత్రకు స్వాగతం పలుకుతూ ఏ ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. ఆ ఫ్లెక్సీలో జననేత జగన్‌ ఫొటో‌తో పాటు నందమూరి బాలకృష్ణ ఫొటో కూడా ప్రత్యక్షమైంది. అదే మార్గంలో పాదయాత్రకు వచ్చిన వైసీపీ కార్యకర్తలంతా ఆ ఫ్లెక్సీ చూసి షాక్ అయ్యారు. అయితే ఈ ఫ్లెక్సీ ఏర్పాటుచేసింది వైసీపీ కార్యకర్త. అందులోనూ అతడు నట సింహం బాలకృష్ణకు వీరా అభిమాని కావడంతో ఇలా ఈ ఫ్లెక్సీని పెట్టినట్లు అక్కడి స్థానికులు చెబుతున్నారు. 

English Title
MLA Balakrishna Photo appears in Ys jagan mohan reddy Flex banner
Related News