ఎట్టకేలకు జవాబు పత్రాలు దొరికాయి..

Updated By ManamSun, 07/22/2018 - 11:20
Missing Bihar Board answer sheets recovered
Missing Bihar Board answer sheets recovered

పట్నా : బిహార్‌లో గత ఏడాది మిస్సయిన 12వ తరగతి జవాబు పత్రాలు ఎట్టకేలకు పట్నాలో లభించాయి. ఇందుకు సంబంధించి స్క్రాబ్‌ డీలర్‌ను శనివారం అరెస్ట్‌ చేసిన పోలీసులు.. ఆన్సర్‌ షీట్లు స్వాధీనం చేసుకున్నారు. 

పక్కా సమాచారం అందుకున్న పోలీసు బృందం ...నిన్న స్క్రాబ్‌ డీలర్‌ దుకాణంపై దాడి చేసి, సోదాలు నిర్వహించారు. వీరి తనిఖీల్లో గత సంవత్సరం బిహార్‌ లో మాయమైన జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని కొనుగోలు చేసిన స్క్రాబ్‌ డీలర్‌ రాజ్‌కిషోర్‌ గుప్తాను అరెస్ట్‌ చేశారు.

కాగా  గత నెలలో బిహార్లోని గోపాల్ గంజ్ లోని ఓ స్కూల్‌లో పదో తరగతి జవాబు పత్రాలు మాయమైన విషయం తెలిసిందే. ఆ స్కూల్‌ కు చెందిన నైట్‌ వాచ్‌మెన్‌ చోటు సింగ్‌ 8,500లకు చెత్త కొనుగోలు డీలరు పప్పు కుమార్ గుప్తాకు అమ్మేశాడు. ఈ కేసులో ఇద్దరిని అరెస్ట్‌ చేసి, వేలాది జవాబు పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English Title
Missing Bihar Board answer sheets recovered
Related News