ప్రేమ పెళ్లి, యువకుడి దారుణ హత్య

Updated By ManamFri, 09/14/2018 - 16:23
Newly married man pranay in Nalgonda district abducted and murdered
Miryalaguda man killed by wife relatives over love marriage in nalgonda district

నల్గొండ :  పట్టపగలు... భార్య కళ్ల ఎదుటే ఓ యువకుడిని దారుణంగా హతమార్చిన సంఘటన శుక్రవారం నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. మిర్యాలగూడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రి సమీపంలో ప్రణయ్ అనే యువకుడిని ఓ దుండగుడు వెనుక నుంచి వచ్చి కత్తితో వెనుక నుంచి దాడి చేసి, హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. ప్రణయ్ ఆరు నెలల క్రితం అమృత అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఆ వివాహం అమృత తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అయినప్పటికీ అమృత..పెద్దలను ఎదిరించి ప్రణయ్‌ను పెళ్లి చేసుకుంది. 

ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ప్రణయ్ తన భార్యతో కలిసి హాస్పటల్ నుంచి ఇంటికి వెళుతుండగా, వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతడిపై దాడి చేశాడు. కత్తితో మెడ మీద బలంగా నరకడంతో ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. మరోవైపు అమృత ఆ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో భయభ్రాంతులకు గురైన ఆమె అక్కడ నుంచి పరుగులు తీసింది.  


Miryalaguda man killed by wife relatives over love marriage in nalgonda districtప్రణయ్‌ది మధ్యతరగతి కుటుంబం కాగా, అమృత తండ్రి పట్టణంలో పేరుమోసిన బిల్డర్. ప్రేమ వివాహం కారణంగానే ఈ హత్య జరిగినట్లు భావిస్తున్నారు. కాగా అమృత కుటుంబీకులే ఈ హత్య చేయించి ఉంటారని ప్రణయ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English Title
Miryalaguda man killed by wife relatives over love marriage in nalgonda district
Related News