పవన్‌కు మంత్రి యనమల సూటి ప్రశ్న..

Updated By ManamThu, 07/12/2018 - 14:14
Pawan vs Yanamala

Pawan vs Yanamala

అమరావతి: జనసేనతో కలిసి వెళ్తామని లెఫ్ట్ పార్టీలు ప్రకటిస్తున్నాయే తప్ప ఆ విషయం గురించి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఏం మాట్లాడటం లేదని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పుకొచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. జనసేన ఇప్పటికీ ఎన్డీఏ మిత్రపక్షమేనన్నారు. ఎన్డీఏ నుంచి బయటికొచ్చామని టీడీపీలా జనసేన ఎందుకు ప్రకటించట్లేదని పవన్‌కు.. యనమల సూటి ప్రశ్న సంధించారు. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి రావాలంటే 5 సవరణలు జరగాలన్నారు. ప్రస్తుతం మైనార్టీలో ఉన్న మోడీ సర్కార్‌ ఆ సవరణలు చేసే పరిస్థితిలో లేదన్నారు. జమిలి ఎన్నికలు దేశసహితం కోసం కాదని.. మోదీ-అమిత్‌షా హితం కోసమేనన్నారు. 

రాష్ట్రాల అజెండా ప్రజల్లోకి వెళ్లకూడదనే జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని యనమల మండిపడ్డారు. ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందన్నారు. అవినీతి లేదు కాబట్టే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీకి ఫస్ట్‌ ర్యాంకు వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

English Title
Minister Yanamala Straight Question To Janasena Chief Pawan
Related News