థ్యాంక్యూ.. హరీశ్ బావా..!: కేటీఆర్

Updated By ManamSun, 06/10/2018 - 19:13
minister ktr says thanks to Harish rao

ktr and harish rao
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ఎట్టకేలకు ప్రభుత్వం ఆదివారం సాయంత్రం పూట శుభవార్తను అందజేసింది. 16శాతం పీఆర్‌ను పెంచుతున్నట్లు ప్రభుత్వం కీలక ప్రకటన చేయడమైంది. కీలక చర్చల అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. మంత్రి హరీశ్‌పై పొగడ్తల వర్షం కురిపించారు.

" రాష్ట్రంలో కీలక మంత్రిగా ఉంటూ.. అటు టీఎంయూకు కూడా గౌరవాధ్యక్షుడిగా ఉన్న హరీశ్‌రావు ఈ కార్యక్రమం మొత్తంలో ద్విపాత్రాభినయం చేశారు. ఇటు మంత్రిగా.. అటు గౌరవాధ్యక్షుడిగా ద్విపాత్రాభినయం చేసి చర్చలన్నీ ఓ కొలిక్కి తీసుకొచ్చి సుఖాంతం చేసినందుకు చాలా సంతోషం" అని చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే థ్యాంక్యూ అని పరోక్షంగా చెప్పారనుకోండి.!

కార్మికులపట్ల కేసీఆర్‌ది చెదరని ముద్ర

"తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి సీఎం కేసీఆర్.. కార్మికుల పట్ల ఉన్న ప్రేమ, గతానుభవం దృష్ట్యా ఆర్టీసీని లాభాల దిశలో పయనింపజేసి కార్మికులకు, ప్రజలకు అందరికీ ఉపయుక్తంగా ఉండేవిధంగా కార్యాచరణ రూపొందించారు. కేసీఆర్ కార్మికపక్షపాతిగా.. వారిపట్ల ఆదరాభిమానులన్న వ్యక్తి అని పలు సందర్భాల్లో రుజువు చేసుకోవడం జరిగింది. సింగరేణి కార్మికుల ధీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ఇది అక్షరాలా నిరూపితమైంది. ఒకప్పుడు ఆర్టీసీ కార్మికులు 43శాతం ఫిట్మెంట్ అడిగితే 44శాతం ఇచ్చి వారి మనసులను గెలుచుకున్న సందర్భాలున్నాయి. కార్మికులపట్ల తనదైన చెరుగని ముద్ర వేసుకున్న వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ బాగుపడితే రాష్ట్ర ప్రజలకు ఎనలేని మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి 16శాతం మధ్యంతర భృతి ఇస్తున్నట్లు ప్రకటించడం జరిగింది" అని మంత్రి స్పష్టం చేశారు.

KTR and Harish

English Title
Minister ktr indirectly says thanks to Harish rao..!
Related News