60 ఏళ్ల కష్టాలు తొలిగిపోయాయ్.: హరీశ్

Updated By ManamWed, 06/13/2018 - 18:17
harish rao launches mission bhagiratha works in jinnaram

harish-rao-launches-mission-bhagiratha-works-in-jinnaram-

సంగారెడ్డి: సంగారెడ్డి జిన్నారం మండలం బొల్లారంలో మిషన్ భగీరథ  పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హరీశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
"
అమీన్‌పూర్‌లో 2కోట్ల రూపాయలతో సబ్ స్టేషన్‌కు శంకుస్థాపన చేశాం.  కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 24గంటల విద్యుత్ ఇస్తున్నారు. గతంలో వేసవికాలం వచ్చిందంటే విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారు.. కానీ ఇప్పుడు ఆ సమస్య తొలిగింది. 30లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంక్‌ను అమీన్‌పూర్‌లో నిర్మిస్తున్నాం. దసరా పండుగ నాటికి ఇంటింటికి నల్లా ద్వారా నీళ్లు ఇవ్వాలన్నది కేసీఆర్ ఆకాంక్ష. అమీన్‌పూర్‌ను మండల కేంద్రంగా చెయ్యడమే కాక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని కేటాయించాం. అమీన్ పూర్ గ్రామ పంచాయతీని స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా మార్చాం. 3000కోట్ల రూపాయలు పటాన్ చెరువు నియోజకవర్గ అభివృద్ధికి ఖర్చు చేసాం. అమీన్ పూర్‌లో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్లను డిసెంబర్‌లో లబ్ధిదారులకు అందిస్తాం. ముఖ్యమంత్రితో మాట్లాడి అమీన్ పూర్‌కు రేడియల్ రోడ్డు శాంక్షన్ చెపిస్తా" అని మంత్రి హామీ ఇచ్చారు.

నీళ్ల కష్టాలు తీరాయ్..!!
"
60 సంవత్సరాలుగా నీళ్ల కోసం బాధపడ్డాం. ఈ బాధలు తీర్చేలా 18కోట్ల రూపాయలతో మిషన్ భగీరథ పనులకు శంకుస్థాపన చేశాం. పనులు అతి త్వరలో పూర్తి చేసి.. బొల్లారంలో దసరా నాటికి ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంజీరా నీళ్లు అందిస్తాం. పనులు చేసే సమయంలో రోడ్ల తవ్వాల్సి ఉంది. ఈ పనులు జరిగే 2/3 నెలలు ప్రజలు సహకరించాలి. బతుకమ్మ పండుగ నాటికి బొల్లారం చెరువులో గుర్రపు డెక్క, చెత్తను తొలగించి సుందరికరించాలని కలెక్టరుకు ఆదేశిస్తున్నాను. 10 రోజుల్లో బొల్లారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యున్ని నియమించి. హై రిస్క్ కేంద్రాన్ని ప్రారంభించాలని కలెక్టరుకు ఆదేశించారు. ముఖ్యమంత్రితో మాట్లాడి అతి త్వరలో మహిళా పొదుపు సంఘాల వడ్డీ లేని రుణం నిధులు విడుదల చేపిస్తాం. బొల్లారంలో మినీ ఇండియా. ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఉన్న ఏ రాష్ట్రం వారికైనా కల్యాణ లక్ష్మీ అమలు చేస్తున్నాం. రూ. 1.5కోట్లతో బొల్లారంలో కల్యాణ మంటపం నిర్మిస్తాం" అని హరీశ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

రూపాయి ఖర్చు లేకుండా..
"
ప్రభుత్వ ఆసుపత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రసవం చేసి.. 12000రూపాయలతో పాటు.. 16 రకాల వస్తువులతో కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ కోతలతో కార్మికులకు కనీసం పని దొరకక ఇబ్బందులు పడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 24గంటల విద్యుత్ సరఫరా చేస్తుండటంతో కార్మికులకు అదనంగా పని దొరకుతోంది. కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు వ్యాపార వేత్తలు వస్తున్నారు. త్వరలో సంగారెడ్డి, పటాన్ చెరువు లో తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లు ప్రారంభించి.. ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తాం. కంటి వెలుగు పథకం ద్వారా వచ్చే నెల నుంచి రాష్ట్రంలోని  ప్రతి ఒక్కరి కంటి పరీక్షలు చేసి.. ఉచితంగా అద్దాలు ఇస్తాం. అవసరమైన వారికి శస్త్రచికిత్స చేపిస్తాం. కాళేశ్వరం ద్వారా జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో సాగు నీరు ఇచ్చి.. ఈ ప్రాంతంలోని కాలుష్యాన్ని దూరం చేస్తాం. నెల రోజుల్లో బొల్లారం పురపాలక సంఘంగా మారుతుంది. పురపాలిక శాఖ నుంచి 20కోట్ల స్టార్ట్ అప్ నిధులు ఇప్పిస్తాం. ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి.  రోడ్ల మీద చెత్త వేయొద్దని.. అలాగే చెట్లను పెంచాలి" అనిస్థానికులకు మంత్రి హరీశ్ సూచించారు.

English Title
Minister Harish rao launches mission bhagiratha works in jinnaram




Related News