మహిళల బీపీ పెంచుతున్న నిద్రలేమి

Updated By ManamThu, 06/28/2018 - 16:19
blood pressure

న్యూయార్క్: మహిళల్లో నిద్రలేమి బ్లడ్ ప్రెషర్‌ను పెంచుతోందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తగినంత నిద్రలేక పోయినా.. సమయానికి పడుకున్నా నిద్ర పట్టక సతమతమవుతున్నా ఈ సమస్య తప్పదని చెబుతున్నారు. చిన్న సమస్యలా కనిపించినా ఇది  దీర్ఘకాలంలో బీపీతో పాటు హృద్రోగాలకు దారితీస్తుందని వివరించారు. రోజుకు ఏడు గంటలు ఆపై నిద్రించే వారితో పోలిస్తే నిద్రలేమి కారణంగా తక్కువ సమయం నిద్రించే వారు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని గత పరిశోధనలలోనే తేలింది. 

women blood pressure

తాజాగా కొలంబియా యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనం ఇదే విషయాన్ని బలపరిచింది. నిద్రలేమి రక్తపోటును పెంచుతుందని.. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువని తేల్చింది. ఈ పరిశోధనలో భాగంగా వర్సిటీ పరిశోధకులు 323 మంది మహిళలపై పరిశోధన జరిపారు. చేతి గడియారాన్ని పోలిన ఓ యంత్రాన్ని వారికిచ్చి నిద్రించే సమయంలో చేతికి ధరించాలని సూచించారు.

ఈ పరికరం సాయంతో వారు నిద్రించే సమయాన్ని, నిద్రలేమితో బాధపడే సమయాన్ని.. తదితర వివరాలను పరిశీలించారు. ఆపై వారి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించగా.. మిగతా వారితో పోలిస్తే తక్కువగా నిద్రించే వారి రక్తపోటు ఎక్కువగా ఉందని తేలింది.

English Title
Mild sleep problems may up blood pressure in women
Related News