‘శాంతి’ సందేశాల చిహ్నం

Updated By ManamFri, 09/21/2018 - 00:56
peace

imageనేడు ప్రపంచంలో ప్రతిరోజు ఏదో ఒక సం దర్భంలో గొడవలు, కొట్లాటలు జరుగుతున్నా యి. రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య, సంస్థల మధ్య దారి తీసే గొడవలు ఒక వైపు, కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలతో మరొక వైపు ప్రపంచం అట్టుడుకుతోంది. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దేశా ల మధ్య పెరుగుతున్న స్పర్థల వల్ల ఏటికేడు రక్షణ వ్యయం పెరుగుతుంది. కొన్ని దేశాలు ఐతే తీవ్రమైన ద్రవ్యోల్బణం సమస్యల్లో చిక్కుకు ని తినడానికి తిండి కూడా లేని దయనీయమైన పరిస్థితులలోకి నెట్టి వేయబడుతున్నాయి. అదే సమయంలో కొన్ని దేశాలు, మరికొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు చాలమందిని ప్రభావితం చేసి శాంతి స్థాపనకు అవిరళ కృషి చేస్తున్నారు.
 

ఇటు వంటి సందర్భంలో ఐక్యరాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21ని అంతర్జాతీయ శాంతి దినోత్సవం జరుపుకుంటాయి. అంతర్జాతీ యంగా కాల్పుల విరమణ, అహింస, శాంతి, సోదరభావాల సాధన కోసం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఎటువంటి అల్లర్లు, ఘర్షణలు కాకుండా శాంతియుత జీవనానికే ప్రజానీకం మొగ్గుచూపుతుంది. ఇది కేవలం అంతర్జాతీయ శాంతి దినోత్సవమే కాదు కాల్పుల విరమణ రోజు కూడా. శాంతి కపోతాలు ఎగరవేసి శాంతి పట్ల తమకు గల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ఈ రోజు ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక సమావేశాలు జరుపుతారు. అ లాగే ప్రపంచశాంతి కోసం కృషిచేసిన వ్యక్తుల కు, సంస్థలకు ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేస్తారు.

అసలు అంతర్జాతీయ శాంతి దినోత్సవం ఉద్దేశం ప్రపంచ ప్రజలందరి మధ్య శాంతి, గౌర వం పెంపొందించడం. ఐక్యరాజ్య సమితి సాధా రణ సభ అన్ని దేశాలు, ప్రజల మధ్య శాంతి నెలకొల్పేందుకు తనవంతు ప్రయత్నం చేసింది. ఈ రోజు ఐక్యరాజ్య సమితిలోని తమ సభ్య దేశాల మధ్య శాంతి, కాల్పుల విరమణకి సం బంధించిన సమస్యలపై అవగాహన కల్పిస్తుం ది. ఇందుకోసం విద్య, ప్రజా అవగాహన ద్వా రా అందరిలో చైతన్యం తీసుకొస్తుంది.

వ్యక్తులు, సంస్థలు, దేశాలు ప్రపంచశాంతి కోసం తమ వంతు ప్రయత్నాలు, ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన రోజు ఇది. శాంతి అనగా తగాదాలు, యుద్ధాలు లే కుండా మానవులందరూ సఖ్యతతో మెలగడం ఉగ్రవాదం పెరిగిపోతున్న ఈ ఆధునిక కాలంలో ప్రపంచ శాంతి చాల అవసరం. ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ఉద్యమాలు వివిధ చిహ్నా లు వాడకంలో ఉన్నాయి. పావురం, ఆలివ్‌కొమ్మ లేదా ఆలివ్ కొమ్మను ముక్కున పట్టుకొన్న పావురం ప్రాచీన కాలం నుంచి చిహ్నాం ఉన్నా యి. అయితే 20వ శతాబ్దంలో అణు యుద్ధ నివారణ కోసం రూపొందిన చిహ్నాన్ని ప్రపంచ వ్యాప్తంగా శాంతికి సంకేతంగావాడు తున్నారు. అంతర్జా తీయ శాంతి దినో త్సవాన్ని 1981లో ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మా నం 36/67 ద్వారా జరపాలని నిర్ణయిం చారు. 1982 సెప్టెం బర్ నుంచి దీన్ని నిర్వహిస్తున్నారు. 2001లో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ 55/ 282 ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీనికి అనుగుణంగా సెప్టెంబర్ 21వ తేదీని అంతర్జాతీయంగా అహిం స, కాల్పుల విరమణ దినోత్సవంగా జరుపు కోవాలని నిర్ణయించారు. 60 దేశాల ప్రజలు విరాళంగా ఇచ్చిన నాణేలతో పెద్ద శాంతి గం టను తయారుచేసి యునైటెడ్ నేషన్స్ అసోసి యేషన్ ఆఫ్ జపాన్ వారు ఐక్య రాజ్యసమితికి బహూకరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి కేంద్ర కార్యాలయం ఆవరణలోని వెస్ట్ కోర్ట్ తోటలో ఈ గంటను ఏర్పాటు చేశారు. యేటా శాంతి దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ఈ గంట మోగించిన తర్వాత దీని సమీపంలోనే నిర్వహిస్తారు.

దేశాలు, జాతులు, సమూహాలు తీవ్ర ఘర్ష ణల్లో మునిగి తేలుతున్నప్పటికీ ఈ రోజు ప్రపం చ వ్యాప్తంగా కాల్పుల విరమణ ప్రకటిస్తూ శాం తి కోసం పలు కార్యక్రమాలను నిర్వహించడం పరిపాటి. ఆ గంటపై ఇలా రాసి ఉంది. ‘సంపూ ర్ణ ప్రపంచశాంతి వర్థిల్లా’లని. కాలం గడిచే కొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచ వ్యాప్త స్వభావాన్ని సంతరిం చుకుంది. ప్రతిదేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంరంభంగా జరుపుకుంటున్నారు.
 
సర్వత్రా శాంతియుత భావాలను బలో పేతం చేయడానికి, ప్రపంచశాంతి దినం అంకిత మవుతుంది. ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రజలు గుంపుగా ఓ చోట చేరాలనేం లేదు. ఎవరైనా, ఎక్కడైనా ఈ దినో త్సవాన్ని నిర్వహించుకోవచ్చు. ఏ మధ్యాహ్న వేళైనా సరే క్యాండిల్ వెలిగిస్తే చాలు. లేదా మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు. లేదా ఉద్యోగులు, వివిధ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు భారీ కార్యక్రమాన్ని జరిపి శాంతి ఆవశ్యకత గురించి ప్రజలకు చక్కగా వివరించవచ్చు. శాంతి గురించి సందేశం ప్రపం చం మొత్తం తెలియజేయడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం.
 
- కాళంరాజు వేణుగోపాల్
8106204412
(నేడు ప్రపంచ శాంతి దినోత్సవం)

English Title
A message of 'peace'
Related News