మగవారు రెస్పాన్సిబుల్‌గా ఉండాలి

Updated By ManamSun, 07/22/2018 - 00:14
kajal

ఇటీవలి కాలంలో సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి విపరీతంగా చర్చలు జరిగిన విషయం తెలిసిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది తాము కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్నామని ప్రకటించుకున్నారు. మరో వైపు కాస్టింగ్ కౌచ్‌పై శ్రీరెడ్డి వంటి వారు పోరాటం చెయ్యడానికి సిద్ధమయ్యారు.

kajal


ఇదిలా ఉంటే కాస్టింగ్ కౌచ్ గురించి హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ ‘‘నా వరకు నేను ఎప్పుడూ కాస్టింగ్ కౌచ్ బారిన పడలేదు. అసలు ఇండస్ట్రీలో అది ఉందో లేదో కూడా నాకు తెలీదు. నిజానికి ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చర్చించుకుంటున్నారని కూడా నాకు తెలీదు. అయినప్పటికీ దీని గురించి నాకు తోచిన సలహా ఇస్తాను. కాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అమ్మాయిల్ని సేఫ్‌గా ఉండమని చెప్పేకంటే, మగవారు మరింత రెస్పాన్సిబుల్‌గా ఉండేలా చేయాలి. ఇలాంటి పనులు చేయకూడదని చిన్నప్పట్నుంచే అబ్బాయిలకు నేర్పించాలి. ఇది ప్రతి ఇంటి నుంచి మొదలు కావాలి’’ అంటోంది. 

English Title
Men should be responcible
Related News