జ్ఞాపకం అచం‘చలం’

Updated By ManamMon, 05/14/2018 - 00:48
chalam

imageకొన్ని సంవత్సరాల క్రితం తురగా జానకీరాణి గారిని కలిసినప్పుడు అవీ ఇవీ మాటల్లో చలంగారి ప్రస్తావన వచ్చింది.  చలం శైలి నాకెంతో ఇష్టమని, ఆయన రచనలు చదువుతుంటే నన్ను కట్టిపడేసేవని చెప్పినప్పుడు ఆమె ప్రతిస్పందన ఇలా ఉంది...
‘అవును, మీరొక్కరే కాదు చాలా మంది చెప్పే మాట అదే! కానీ నేను దానితో ఏకీభవించను. ఆయన రచనా శైలి కన్నా అందులోని విషయాన్ని క దా ఆలోచించాలి. శైలి కోసం చదువుతారా? విషయం కోసం చదువుతారా?’ అని ప్రశ్నించేసరికి నేను ఒకిం త ఖంగుతిన్నాను. కారణం నాకు చలం శైలి అంటే ప్రాణం. ఊపిరి. శ్వాస. ఇలా ఎన్న మాటలైనా చెప్పు కోవచ్చు. అప్పటికీ నేను చెప్పదలచుకున్నది చెప్పాను ఆమెతో. దీనిమీద ఇద్దరి అభిప్రాయాలు ఏకం కా లేదు. ఎవరి దారి వారిదే అన్నట్టు మాటలు సాగాయి. అదలా ఉండనిస్తే, ఇప్పటికీ ఎప్పటికీ నేను ఆయన శైలిని ప్రేమించడానికి తపించేవాడిని. అనుసరించడాని కి ప్రయత్నించాను. కానీ అది నా రచనకు ఆ పట్టు చిక్కలేదు. చలంగారిలోని సుగుణాలలో నన్ను ఎంత గానో ఆకట్టుకున్నది ఆయన ఉత్తరాలకు జవాబిచ్చే తీరు. తనకు ఉత్తరం రాసిన వ్యక్తి ఎంతటివారైనా సరే దానికి జవాబివ్వడం ఆయనకే చెల్లు. నేనూ అలాగే ఆయన నుంచి ఓ నాలుగైదు ఉత్తరాలకు జవాబులు తెప్పించుకుని తెగ మురిసిపోయాను. 


ఉత్తరాల సాహిత్యాన్ని నేను అమితంగా ఇష్టపడ తాను. కారణం అందులో రచయిత మనసు విప్పి మాట్లాడతారని నా ప్రగాఢ నమ్మకం. చలం గురించి తెలియాలంటే ఆయన కథలు, నవలలు, నాటకాలు వంటి సాహిత్య రచనలు చదవడం పక్కనపెడితే  ఆ యన రాసిన ఉత్తర సంపుటాలు చదివితే బాగుంటుం దని నా నమ్మిక. ముఖ్యంగా చింతా దీక్షితులకు ఆయన రాసిన లేఖలు అందులో ప్రముఖస్థానాన్ని ఆక్రమిస్తాయనడం అతిశయోక్తి కాదు. ‘చలం గారి ఉత్తరాలు చింతా దీక్షితులు గారికి’ పుస్తకానికి ముం దు మాటగా రాసిన విషయం...

దీక్షితులుగారు ఈ వుత్తరాలు దాచారు. ఆయన శ్రమ ఎవరికో ఒకరి కన్నా ఉపకరిస్తుందని ఆశ ఈనాడు. ఈ ఉత్తరాలన్నీ ఇంగ్లీషులో రాసినవి. చేత కాని చోట్ల తప్ప తక్కినదంతా తెలుగు చేశాను. ఇత రులను గాయపరుస్తాయన్నవీ, అధికార్లని పేరు వరస గా తిట్టిన తిట్లూ, రెండుమూడు బూతులు తప్ప, తక్కిన విషయమంతా ఉన్నది ఉన్నట్లు తెలిగించాను. ఏమీ ఇంటరెస్ట్ ఇయ్యవన్న కొన్ని సంగతులు వొదిలేశాను. ఆయన నాకు రాసిన ఉత్తరాలు దాచని నా నిర్లక్ష్యం నా అంధత్వం,  అల్పత్వం  క్షమించ తగినవి కావు. ఈ వుత్తరాలలో నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆయా నాటివి. ఈనాటికీ చాల విష యాల్లో నా అభిప్రాయాలు మార్పు చెందాయి, చెందుతున్నాయి (1144).

అయితే ఈ పుస్తకానికి ‘ఒక మాట’ అంటూ ‘చింతా దీక్షితులు ఈ ఉత్తరాలు చదివితే వేంకటచలం హృదయానికి సమీపంగా పోవచ్చు. దాని లోతూ వైశాల్యమూ తెలుసుకోవచ్చు. వారి సారస్వత కృషికి పురికొల్పిన భావోద్వేగం ఇందు గమనించవచ్చు’ అనడం బట్టి ఉత్తరాలు ఓ వ్యక్తి నడకను, నడతనూ చెప్తాయనడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి. ఓ ఉత్తరంలో చలం తన కథలపై వస్తున్న విమర్శలపై రాస్తూ అవి చాలా ఉల్లాసంగా ఉంటున్నా యని, తనకూ, దేశానికీ జ్ఞానబోధకంగా ఉంటున్నా యని చెప్పుకున్నారు. మొత్తానికి అశ్లీలాలు రాసే వేంకటాచలం అనే వాడు ఇంకా ఉన్నాడని ఈ విమ ర్శలు జ్ఞాపకం చేస్తుంటాయని చెప్పారు. 

1929 జనవరిలో రాసిన ఉత్తరంలో ‘నేను చాలా సెన్సిటివ్...ముఖ్యం స్నేహితుల విషయమై...కొన్ని సమయాలు వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోను. మిమ్మ ల్ని  ఎప్పుడూ ఘనంగా ఎంచుకున్నాను, నా ఉప యోగం కోసం కాదు,  నేను చూసిన వాళ్ళల్లో ...కాని యీ మధ్య మీకు తెలీకుండా నేనేమో, మీకు మీ ఉత్త రాల్లో నన్ను దెప్పుతున్నట్టు కనపడ్డది...నేనేమన్నా చేశానా? మీకు బాగా తెలిసిన ఆయన ఒకరు నా కథల్ని మీరు వెక్కిరిస్తున్నారని చెప్పారు. కాని ఆయన మాటల్ని ఏ మాత్రమూ నమ్మడానికి వీలులేని మనిషి. నా కథల్ని తిట్టడం అపరాథమని కాదు కాని, మీ ఉద్దేశ్యం మారితే, నాకు తెలియచేసి ఉండేవారే కదా అనుకుంటాను. పైగా నేనీ మధ్య రాసిన వాటి విషయమై మౌనంగా వూరుకున్నారు కూడాను’ అని రాశారు. చలం దృష్టిలో రచయితలు రెండురకాలు. ఓ వర్గం వారేమో సాహితీలోకానికి ఓ ఉద్గ్రంథాన్ని వదిలిపోతారని, మరోవర్గం వారు తాము సొంతంగా గొప్పదేమీ రాయకపోయినా సారస్వతానికి కొత్త జీవ నాన్నిచ్చేవారని ఆయన అభిప్రాయం. అయితే ఏ కొందరో ఈ రెండూ చెయ్యగలరని కూడా ఆయన తెలిపారు. ప్రముఖ హాస్యరచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలు ఆ నిమిషానికి కులాసాగా చ దవడానికి పనికొస్తాయని చెప్పిన చలంగారు విశ్వ నా థ సత్యనారాయణ కవిత్వం తనకర్థం కాదని, అయితే తప్పిదమంతా చాలావరకూ తనదే అయి ఉండొచ్చని కూడా ప్రకటించారు. బసవరాజు అప్పారావు ఓ గొప్ప కవిత్వ పు పంక్తి కోసం నూరు డబ్బాల చెత్త రాస్తాడని, అత న్ని మరిచిపోవడం న్యాయంగా తోస్తోందని నిక్కచ్చిగా చెప్పిన చలంగారు చింతా దీక్షితులను ఒక్కోసారి ఒక్కో రకంగా సం బో దించేవారు. వాటిలో కొన్ని చూద్దాం. డియర్ ఆపిల్ ఆఫ్ మై ఐ, ఆర్ ఆరెంజెస్ ఆఫ్ మై ఇయర్, ఆర్ పంపర పనస ఆఫ్ మై నోస్ అని ఓ చోట సంబోధించగా డియర్ పేపర్ మేకర్, డియర్ నశ్యా ఘ్రాతకా, మైడియర్ లాంగ్ ఫెల్లో, డియర్ డిప్రెస్డ్ డా డ్, మై డియర్ మస్కిటో కిల్లర్ ఇలా ఉత్తరం ప్రా రంభించేవారు. 1930 ఆగస్టు 31న రాసిన ఉత్తరంలో స్త్రీ అనే పుస్తకాన్ని ఇలా అంకితం చేస్తానని రాశారు. ఆ మాటలేంటో చూడండి...

ఒక్క నిముషం నాకు / విశ్రాంతినివ్వక
మహా ప్రణయమారుత వేగాల మీదనో
అగాధ వియోగ భారం కిందవో
చీల్చి, నలిపి / ఊపిరాడనీక
నా జీవితాన్ని పాలించే /స్త్రీ లోకానికి 
నివేదితము.... 


మొదటి సారి ‘స్త్రీ’ పుస్తకం అచ్చయినప్పుడు దానికి మొదటి మాట అంటూ ఇలా రాశారు. ‘స్త్రీకి కూడా శరీరం ఉంది/దానికి వ్యాయామం యివ్వాలి/ ఆమెకి మెదడు ఉంది/దానికి జ్ఞానం యివ్వాలి/ ఆమెకి హృదయం వుంది/దానికి అనుభవం యివ్వా లి ... అనే సంగతి గుర్తించని ఈ దేశానికి నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా? పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి, వొళ్ళు తెలీక, నోటికి వచ్చినట్లు కూసిన కూతలనుకుంటారని తెలుసు. కాని ఇట్లాంటి పుస్తకం నా చిన్నతనంలో దొరికితే, నా జీవితాన్ని యి ప్పటికన్నా యెన్నో రెట్లు పవిత్రవంతమూ, సార్థకమూ చేసు కోగలిగేవాణ్ణి. నా వంటివారు ఈ నూతన యుగంలో వున్నారేమో! అని పేర్కొన్నారు. వజీర్ రహ్మాన్ కు రాసిన ఓ లేఖలో ఇలా చెప్పుకొచ్చారు. ‘..మీకు ఇంగ్లీషులోగానీ, ఉర్దూలోగానీ, పర్షియన్‌లోగానీ సూఫీ కవిత్వం తెలుసా? శృంగార గీతాలు తెలుసునా? చివ రి రెండుభాషల్లో! తెలుగులో ఎంకిపాటలు ఇష్టమా? కొత్త ఎంకిపాటలు చదివారా?’ 1961 ప్రాంతంలో వరవరరావు ఓ కవిత రాశారు. అది మల్లెలపై కవిత. అది రాయడానికి కారణం టాగోర్ స్ట్రేబర్డ్స్, గీతాంజ లిని చలం చేసిన అనువాద రచనలే. అవి తననెంతో ప్రభావితం చేశాయని చెప్పుకున్నారు వరవరరావు. చ లానికి మల్లెలపై ఓ ఉత్తరం రాస్తూ ‘అరుణాచలంలో ఏ పూలు ఎక్కువగా పూస్తాయో తెలియదుగానీ ఆ ప్ర శాంత వాతావరణం మల్లికాసుమ పరిమళం కన్నా గొప్పదైన అనుభవాన్ని మనసుకిస్తుందని విశ్వసిస్తా ను. అందుకే ఆంధ్రదేశం పోగొట్టుకున్న మిమ్మల్ని అ రుణాచలం కడుపులో దాచుకున్నది. భగవాన్ రమణ మహర్షి అనే అలౌకిక కుందనసుమం మీ మనస్సు నలా ఆకట్టి ఉండాలి. ఆ ఆధ్యాత్మిక లోకాల గురించి నాకు తెలియదు. నేను రాయలేను కూడా. టాగోర్ స్ట్రేబర్డ్స్, మీ గీతాంజలి అనువాదం చదివాక అలాగే ఓ 70 ఖండికలు వ్రాసాను. ... అంటూ మల్లెపూలపై  కొన్ని కవితలను చలం అభిప్రాయానికి పంపారు వరవరరావు. వరవరరావు మల్లెల ఖండికలకు చలం ప్రతిస్పందన లభించి ఉండే బాగుండేది. చలంగారికి మల్లెపూలంటే ఎంతో ఇష్టం.
ఆయన మ్యూజింగ్స్‌లో ‘‘మల్లెపూలు’ పై రాసిన మాటలు దీన్ని స్పష్టపరుస్తాయి.
 
- యామిజాల జగదీశ్
81870 45093
(19న చలం జయంతి)

English Title
memory unlimited
Related News