మూడేళ్ల బాలిక నోట్లో టపాసు పేల్చాడు..

Updated By ManamThu, 11/08/2018 - 15:51
Meerut youth, Diwali cracker, 3-year-old's mouth, critically injures child
  • చిన్నారికి తీవ్రగాయాలు.. పరిస్థితి విషమం

  • ఉత్తర‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘటన.. 

  • టపాసు పేల్చిన యువకుడి కోసం గాలింపు 

Meerut youth, Diwali cracker, 3-year-old's mouth, critically injures childలఖ్‌నవ్: సరదా కోసం ఓ యువకుడు చేసిన పనికి మూడేళ్ల బాలిక తీవ్రంగా గాయపడింది. దీపావళి పండుగ సందర్భంగా టపాసులు పేల్చిన యువకుడు... మూడేళ్ల బాలిక నోట్లో టపాసు పెట్టి నిప్పు అంటించాడు. ఆ టపాసు ఒక్కసారిగా పేలడంతో చిన్నారి నోరు, గొంతుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మంగళవారం మిలాక్ గ్రామంలో చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చిన్నారి ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో హరపాల్ అనే యువకుడు అక్కడికి వచ్చి బాలిక నోట్లో టపాసు పెట్టి పేల్చినట్టు బాధితురాలి తండ్రి శశి కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు చిన్నారి నోట్లో టపాసు పేల్చిన యువకుడి కోసం గాలిస్తున్నారు. బాలిక నోట్లో టపాసు పేలడంతో తీవ్రగాయాలయ్యాయని, 50 వరకు కుట్లు పడ్డాయని, గొంతులో కూడా ఇన్ఫిక్షన్ సోకినట్టు వైద్యులు తెలిపారు. 

బాంబు తీవ్రత కారణంగా చిన్నారి నాలుక తెగిపోయిందని చెప్పారు. బాలిక చెంపలు బాగా దెబ్బతిన్నాయని, చిన్నారి నోట్లో టపాసులోని ధూళికణాలు ఉండిపోయానని వైద్యుడు చెప్పారు. బాధిత బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ.. హర్‌పాల్ అనే యువకుడు తన మూడేళ్ల కుమార్తె నోట్లో టపాసులు పెట్టి పేల్చడంతో తీవ్రగాయాలయ్యాయని ఆమె ఆరోపించింది. యువకుడిని కఠినంగా శిక్షించాలని తల్లి డిమాండ్ చేసింది.   

English Title
Meerut youth lights Diwali cracker in 3-year-old's mouth, critically injures child
Related News