లెక్క‌ల్లో పూరా?..ఇలా చేస్తే బెట‌ర్‌!

Updated By ManamFri, 08/10/2018 - 16:20
maths students
maths students

గ‌ణితం అంటేనే జంకే విద్యార్థులు ఇక నిర్భ‌యంగా ఉండొచ్చు. ఒక చిట్కాతో లెక్క‌లు ఈజీగా చేయెచ్చు. నిటారుగా కూర్చోండి..భుజాలు వెన‌క్కి వాల్చండి..ఆత్మ విశ్వాసంతో ఉండండి..అంటూ మ‌న‌స్త‌త్వ నిపుణులు చెప్పే ఈ సూత్రం..ఇప్పుడు క్లాస్‌రూంలోనూ ఉప‌యోప‌డనుంది. అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ అధ్య‌య‌న‌క‌ర్త‌లు చేప‌ట్టిన ప‌రిశీల‌న‌లో ఈ విష‌యం రుజువ‌యింది. 

అదేమిటంటే.. పరీక్ష హాల్లో, క్లాస్ రూంలో భుజాలు వెనక్కి వంచి నిటారుగా ఉంచి కూర్చుంటే చాలు ఏకాగ్రతను సాధించిన‌ట్లేన‌ని చెబుతున్నారు. ముందుకు ఒంగి కూర్చోకుండా నిటారుగా కూర్చోవడానికీ, గణితంలో రాణింపున‌కు  చాలా ద‌గ్గ‌రి సంబంధం ఉందంటున్నారు. మొత్తం 125 మంది విద్యార్థులకు ఓ లెక్క చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టారు.

ఈ లెక్క చేసేటప్పుడు వాళ్లు భుజాలు వెనక్కి పెట్టి నిటారుగా కూర్చున్నారా? లేక ఒంగి ఉన్నారా? అనేది గ‌మ‌నించారు. ఇందులో చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. 86 శాతం మంది నిటారుగా కూర్చున్న విద్యార్థులు ఆ లెక్కను తేలిగ్గా చేశార‌ని తేలింది.  ముందుగా గణితంపై వారికున్న ఆసక్తిపై ఒక ప్రశ్నాపత్రాన్ని కూడా  పూర్తి చేయించారు. 

గణితంలో ఆసక్తి ఉంద‌ని తెలిపిన వారి మేథ‌స్సును కూడా కూర్చునే భంగిమ ప్రభావితం చేసిందని గుర్తించారు. కూలబడి కూర్చున్నవారి మెదడు సరిగా పనిచేయక‌ ఆలోచించలేని స్థితికి వచ్చారని కూడా ఈ అధ్యయనంలో తేలింది. కూలబడినట్టు కూర్చొనే భంగిమ వ్యక్తిలోని పాత ప్ర‌తికూల‌ జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు వ‌చ్చేలా చేస్తాయ‌ని వారంటున్నారు.

లెక్కలపై ఆసక్తిలేని వారి కూర్చునే భంగిమ సరిగ్గా లేకపోవడంతో వారు లెక్క చేయడంలో ఇబ్బందికి కారణమయిందని అధ్యయనం తేల్చింది. ఇవే ఫ‌లితాలు ఇత‌ర పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డే వారికీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు అభిప్రాయపడ్డారు. వివిధ రంగాల ఆట‌గాళ్లు, సంగీతకారులు, వక్తలూ నిటారుగా కూర్చునే భంగిమలో రాణించగలరంటున్నారు.

English Title
This is Mathemagic, good posture help you perform better at math?
Related News