‘మేధావి’ సుద్దులు.. దొంగలకు సద్దులు..!

Updated By ManamSat, 11/10/2018 - 01:06
mathanam

imageవలస పాలనలో ఆడిందే ఆటగా సాగించిన కొన్ని నోళ్ళు.. త మ ఆటలు సాగకుంటాలికె.. నీయంత నీయంతే లేడు.. అంటున్నయి. వలసపాలకుల కొమ్ముకాసిన రాతలు ఇవాల తెలంగాణల ప్రజావ్యతిరేకతను చాటుకుంటున్నయి.
నిన్నియాల ముఖ్యంగా..చంద్రబాబు పోయి కాంగ్రెస్‌తో ని పొత్తు పెట్టుకున్న కాన్నించి  కొంతమంది రాజకీయ మేధో మీడియా మధ్యవర్తులు.. కూటమిగట్టి నియంతృత్వానికి కొత్త నిర్వచనం ఇస్తూ.. తొత్తు పలుకులు పలుకుతున్నరు. తెలం గాణలో కేసీయార్‌ది నియంతృత్వ ధోరణి అంట.. అది రాను న్న ఎన్నికల్లో ఎదురుదెబ్బ కొట్టే అవకాశాలున్నయంట.. స్వరం మార్చి అసంబద్ధ సూత్రీకరణలు చేసుకుంటూ అర్థ సత్యాల వ్యాసంగాలకు పూనుకుంటున్నరు.

తెలంగాణను తెర్లు చేయాలని చూసే పక్కరాష్ట్ర కుట్ర బాజీగాల్లకు., తమ స్వార్థం కోసం దొంగలకు సద్దులు మోసు ్తన్న ఇక్కడి రాజకీయ నాయకులకు., తమ గొంతెమ్మ కోరిక లను తీరుస్తలేడని అలిగి ద్వేషాన్ని పెంచుకోని పిచ్చిరాతలు రాస్తున్న మేధావులకు., తమ స్వార్థ ప్రయోజనాలకు ముసిగేసి పని నెగ్గించుకుందామనుకునే కుంచెనగాన్లకు, వుత్తుత్తగనే ద్వేషాన్ని పెంచుకుని పిచ్చిపిచ్చి కూతలకు తెగబడుతున్న అజ్జా నులకు... ప్రజాసంక్షేమం దృష్టితో తీసుకుంటున్న కేసీయార్ నిర్ణయాలు నియంతృత్వపు నిర్ణయాలుగానే కనిపించడంలో ఆశ్చర్యపడాల్సిందేమి లేదు. 
 

image

దళారీలు, అక్కరలేకుండా ప్రజలకు నేరుగా ప్రయోజనా లు చేకూర్చే నిర్ణయాలే.. ముఖ్యమంత్రి మీద నియంత.. అనే నిందకు కారణమౌతున్నయని స్థూలంగా అర్థం చేసుకోవచ్చు. మా వెంటే  సమాజం వుందీ అని ఇన్నాల్లూ ప్రభుత్వాలతో రాయబేరాలు సాగించుకుంటూ తమ సొంత ప్రయోజనాలు తీర్చుకుంటూ పబ్బంగడుపుకుంటున్న కొంతమంది మేధో మ ధ్యవర్తులకు కేసీయార్ నిర్ణయాలు తమ పొట్టమీద కొట్టినట్టు గా ఏడుస్తున్నరు. కేసీయార్ ప్రభుత్వం అమలు పరుస్తున్న సం క్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారునికే చేరుతుండ డంతో మధ్యవర్తుల అక్కెరలేకుండా పోయింది. దాంతో అడిగి నప్పుడల్లా ఈ మధ్యవర్తుల నేతలకు సీఎం ఆయింట్‌మెంటు పూస్తలేడు.. సో లొల్లి. 
కేసీయార్ మీద నియంత సూత్రీకరణలు చేసేవాల్లలో మూడు రకాలున్నరు. ప్రస్తుతం వొకరు మేధో మధ్యవర్తులు, అంటే మేధావులు, జర్నలిస్టులు తదితరులు (అందరూ కా దు). రొండోది... సామాజిక మధ్యవర్తులు- అంటే ఇన్నాల్లు ఆయా సామాజిక వర్గాలకు పెద్దలుగా వ్యవహరించిన వాల్లు (అందరూ కాదు). ఇక మూడోవాల్లు.. రాజకీయ మధ్య వర్తులు.. అంటే ప్రజలకు మీమే ప్రత్యామ్న్యాయం అంటూ దశాబ్దాలుగా జనాన్ని ధర్నాచౌక్‌లకు పరిమితం చేసి విజిటింగ్ కార్డు పార్టీలను నడుపుతున్న వాల్లు (వీల్లు కూడా అందరూ కాదు). 
ముఖ్యమంత్రి కేసీయార్ తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణ యాలు ఈ మూడు సెక్షన్లకు కంటకింపుగా మారినయి.. అవెట్లనో తెలుసుకుందాం.

సీఎం తీసుకుంటున్న ప్రజా సంక్షేమ నిర్ణయాల ద్వారా ఈ మధ్యవర్తి నేతలకు రొండు తీర్ల నష్టాలు జరుగుతున్నయి. వొకటి... మావాల్లు అంటూ తాము క్లైమ్ చేసుకునే ప్రజలను అడ్డం పెట్టుకోని ఇన్నాల్లూ వీల్లు సాగించిన ఆధిపత్యానికి గండి పడుతున్నది. రొండోది... ప్రభుత్వమే నేరుగా ప్రజలకు కనె క్టయినంక ఇగ మధ్యవర్తులుగా చలామణి అయితున్న నాయ కులను ప్రజలెందుకు పట్టించుకుంటరు.? సో అదే జరుగు తున్నది. దాంతో మా పనిఖతం అని వీల్లకో భయం పటు ్టకోని, కేసీయార్‌ను నియంతగా చిత్రీకరించే ప్రయత్నం చేసు ్తన్నరు.

ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వాటిని ఎత్తి చూపుతూ ఎప్పటికపుడు పాలనా వైఫల్యాలను ఎండ గడుతూ ... జనం మెప్పుపొందడం తద్వారా ఎన్నికల్లో ప్రజాదరణను పొంది అధికారంలోకి రావడం అనేది ప్రజాస్వామ్యంలో సర్వ సాధారణ ప్రక్రియ. కానీ ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వ ప్రజావ్యతిరేక కార్యక్రమాలు లేవు కావట్టి ప్రతిపక్షాలకు ఆయు దాలు లేవు.. ప్రభుత్వాన్ని నిందించడానికి. మరేంజేయాలె? ఏదోవొకటి తిట్టంది తప్పు పట్టంది... మనం ప్రజలకాడికి ఎట్లా పోతం? ప్రభుత్వాన్ని యేమనలేం కావట్టి కేసీయార్‌ను వ్యక్తిగతంగా దూషించాలె. కేసీయార్ నియంత అని, కేసీయార్ కుటుంబం అని., ఇకేందో ఇంకేందో అని తిట్టిపోయాలె. అదే చేస్తున్నయి తెలంగాణ ప్రతిపక్షాలు.

ఇక మేధావి వర్గం... వీల్లదీ అటువంటి విచిత్ర పరిస్థితే. ప్రభుత్వ నిర్ణయాలను, చేపడుతున్న ప్రజాసంక్షేమ కార్యక్రమా లను  వొకవైపు వీరు అనివార్యంగా పొగడాల్సి వస్తుంది, ప్రపంచం అంతా గుర్తించినప్పుడు మనం మంచిగలేవు అంటే నోట్లె వూంచుతరు అని వున్న వాస్తవాన్ని వొప్పుకుంటూనే.. దిక్కుతోచక మరో దిక్కు కేసీయార్‌ను విమర్శిస్తున్నరు. వీల్లకు కోపం ఎందుకంటే.. తమకు బతుకుదెరువునిచ్చిన వలసపా లనలోని మూస పద్దతులను సమూలంగా ప్రక్షాళన చేస్తున్న డనీ, ఇన్నాల్ల ప్రభుత్వాలు ఆచరించిన సంప్రదాయాలను కా దని భిన్నంగా కేసీయార్ వ్యవహరిస్తున్నడనీ కోపం. వచ్చి సెక్రటేరియట్ల కూసుంటే గటి కోపాలి వచ్చి అదో ఇదో పైరవీ చేయించుకోని పోదుం.. అట్లకాకుండా పాయె అనీ.. వాల్ల కోపం. ప్రభుత్వాలు వచ్చీ పోతాంటె, వాటితో పాటు మారే ముఖ్యమంత్రుల కాడికల్లా పోయే వాల్ల రెగ్గులర్ పంప్రదా యానికి తెరపడ్డది. అదీ కత. 

అయితే... మన సీఎం కేసీయార్ ఈ సంప్రదాయానికి తెరదించిండు. అందరోతిగె.. ఆయిట్‌మెంట్ పూసే ముఖ్య మంత్రి కాదుగా.. అక్కడొచ్చింది సమస్య. తెలంగాణ తెచ్చి నోడు.. చరిత్రను సృష్టించినోడు.. ఆయనకు తెల్వదా.. ఈ మే ధో మధ్యవర్తిత్వం సంగతి.. ఆయన ఉద్యమ కాలంలోనే చూసిండు.. ఎవలేంది.. అనే సంగతి. పుట్టింటి సంగతి మేన మావకు తెల్వదా అన్నట్టు... కేసీయార్‌కు అన్నీ తెలుసు. తెలిసినోడు కావట్టే... ఈ మేధో మధ్యవర్తిత్వానికి.. అడ్డగో లుగ ఆయిట్‌మెంటు పూసే ప్రయత్నం చేస్తలేడు. 

విలుకానికి పిట్టకన్నే లక్ష్యంగా వున్నట్టు., ఇప్పుడు తెలం గాణ ముఖ్యమంత్రి ముందున్న కర్తవ్యం...సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో అరవయేండ్లుగా ఆగ మైపో యి వున్న తెలంగాణ సమాజానికి వొక భరోసా కల్పించడం. ఇదీ తనముందున్న అత్యంత ముఖ్యమైన కర్తవ్యం. దాన్ని నూటికి నూరుపాల్లు నెరవేర్చిండు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినకాంచి నాలుగేండ్ల అతి తక్కువ కాలంలో... ఇంత గుణాత్మక అభివృద్ధి సాగించిన నూతన  రాష్ట్రం  ఈ దే శంలనే కాదు ఈ ప్రపంచంలనే వున్నదా? లేదు. అ నుంచి హ వరకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ఇవాల ప్రజల మనసుల్లో వొక విశ్వాసాన్ని నింపినయి. స్వయంపాలనలో తామూ గొప్పగా జీవించగలం అనే భరోసాను నింపినయి. అవి కొన్ని కోట్ల కోట్ల రూపా యలతోని సమానం.

పండుముసలోల్ల కానించి పచ్చి బాలింత దాకా... బల్లెకు పోయే పిలగాని కాంచి శెల్కలకు పోయే రైతు దాంకా.. తలెత్తుకోని బితికేలా రూపుదిద్దుకున్న ప్రభుత్వ పథకాలు ప్రపంచాన్నే సంబ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నయి.

అట్లా అభద్రతా భావం నుంచి తన ప్రజలను బైట పడేసి .. భవిష్యత్తు మీద వొక ఆశను కల్పించడం.. అనే సూక్ష్మం కేసీయార్ పాలనలో వున్నది. ఈ సూక్ష్మాన్ని ప్రజలు గ్రహించి న్రు కానీ, రాజకీయ సాంస్కృతిక సామాజిక ఆర్ధిక రంగాలకు చెందిన మేధో మధ్యవర్తులకే గ్రహించేంత శక్తి లేదు. ఇటు వంటి నేపథ్యంలో... తమ ఆటలు సాగుతలేవని కూటమి గట్టి సరికొత్త నాటకానికి తెరేలేపిండ్రు. దాంతో కొత్త దేవుండ్ల ప్రవే శం సురువయింది. తెలంగాణ కాంగ్రేస్ నేతలకు చంద్రబాబు వో కొత్తాదేవుడయితే.. చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఆపద మొక్కులవాడయిండు. 
అట్లా కొత్త సీసాలో పాతసారా పోసి ప్రజలను వంచించ డానికి గతాన్ని మరిచిన గజినీ మహ్మదులై తెలంగాణ మీదికి దండయాత్రకు బయలుదేరిన్రు.

 అసలు నియంత పాలన తెలంగాల ఎవరి హయాంలో జరిగిందో జనం అప్పుడే మర్చిపోయిన్రు అనుకుంటే పొరపా టే. వలసవాద ఆంధ్రా ప్రభుత్వాన్ని తెలంగాణలో నడి పిన చంద్రబాబు హయాంలో ప్రజలు ఎంత గోసపడ్డరు.? ప్రజా సంక్షేమాన్ని మరిచి ప్రజలమీదనే దాడులు చేసి వారిని కాల్చి చంపిన ఘటనలు బాబు హయాంల ఎన్నిలేవు? వ్యవసాయం దండుగ అని రైతును అరిగోస పోసుకున్న చరిత్ర... జీతాలు పెంచమని అడిగిన పాపానికి గుర్రాలతో అంగన్ వాడీ ఆడ బిడ్డలను తొక్కించిన పాపం ఇదే చంద్రబాబుది కాదా? కరెంటు చార్జీలు తగ్గించమంటే కాల్చి సంప లేదా? ఎన్ కౌంటర్ల ముసుగున తెలంగాణ బిడ్డలను పిట్టలను కాల్చినట్టు కాల్చిచంపిన ఘోరానికి ఇదే బాబు వొడికట్టలేదా.? ఇక్కడ రాయడానికి పేజీలు సరిపోని నియంతృత్వ వైఖరులు ఆంధ్రా పాలకవర్గమైన టీడీపీ  చంద్రబాబుది కాదా.? దాంతో పాటు 1948 తెలంగాణ ఏర్పాటయినకాంచి.. ప్రజలు త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న 2014 దాక.. తెలంగాణను అరిగోస పుచ్చుకున్నది నెహ్రూ నుంచి సోనియాదాకా కాంగ్రెస్ పార్టీ కాదా?

ఇన్నాల్ల టిడీపీ వలసపాలన, దుర్మార్గమైన కాంగ్రెస్ పాల నేమో ఇయ్యాల బెల్లపప్పయింది. కేసీయార్ ప్రజా పాలనమో చేదయినాది. మేధావి వర్గం ఎంత అసహనంతో వుంటే... ఆ రాజ్యం లో పాలన బాగా సాగుతున్నట్టు లెక్క అని అంటడు భారత దేశ రాజనీతి శాస్త్రవేత్త చాణక్యుడు. ఇది మనోల్లను చూసే చెప్పిండా యేంది చాణక్యుడు అని అనిపిస్తది. ఇది తెలంగాణ మేధోమధ్యవర్తుల విషయంలో నూటికి నూరుపాల్లు నిజం.. అని మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణను తెర్లు చేసే కుట్రలకు తెగబడితే.. ఆ బ్రహ్మ దేవునికి కూడా వినడు., ఎంతటి మొనగాన్లనయినా ముక్కు పిండి కూసపెట్టే ప్రజల మనిషి కేసీయార్.

ఈ సందర్భంగా మనం వొకసారి చరిత్రలోకి తొంగి చూ ద్దాం..
విప్లవం విజయం సాధించి కార్మికవర్గం కమ్యునిస్టు రాజ్యాన్ని స్థాపించిన ప్రారంభదశలో.. ‘ప్రాలిటేరియట్ డిక్టే టర్ షిప్..’ వో అనివార్య ప్రక్రియ అని సిద్ధాంతీకరిస్తడు కారల్ మార్క్స్.

అదేంటిది.. సమ సమాజం కోసం పోరాడి కమ్యునిస్టు రాజ్యాన్ని స్థాపించిన కార్మికుడు, తీరా తాను అధికారంలోకి వచ్చి నప్పుడు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలె కదా..నియంతృత్వంగా వ్యవహరించడం ఏమిటి.? అనే సందేహం మనకూ రావచ్చు. 
మన సందేహాలను నివృత్తి చేసే క్రమంలో.. వొక అద్భుతమైన విశ్లేషణను, అట్లా ప్రారంభ దశలో నియంత త్వంతో ఎందుకు వ్యవహరించాలో కారణాలు ఈ విధంగా వివరిస్తడు.. కారల్ మార్క్స్.

‘నూతన ప్రజా స్వామిక విప్లవం విజయవంతం కాగానే రాత్రికి రాత్రే అన్నీ మారిపోవు. పాత లక్షణాలను కొత్త సమా జమూ మోసుకోని వస్తది. గత పాలకులు వదిలిపెట్టి పోయిన విలువలు సంప్రదాయాలు, పాలనాపరమైన మూస ధోరణులు నూతన కార్మిక ప్రభుత్వానికి సమస్యగా మారుతయి. అటు వంటి సంధి దశలో సామాజిక ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో పాత మూస ధోరణులను రూపు మాపేందుకు కొది ్దకాలం పాటు ఈ (పాజిటివ్) నియంతృత్వం అమలు పర చాలె..’ అంటడు మార్క్స్.
దీన్ని పట్టి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే... సమ సమాజంలో శాశ్వతప్రాతిపదికన ప్రజలకు మంచి జరగా లంటే.. దాని ప్రారంభ దశలో కొంత నియంత్రణ తప్పదూ అని.

తెలంగాణలో స్వయం పాలన ప్రారంభం కాంగనే అస్థి రతను రాజేయ చూసిన కొన్ని మీడియా సంస్థలను కట్టడి చేయడం కావచ్చు. దేశంలో యే రాష్ట్రం లేనట్టూ తెలంగాణ రాంగనే ప్రత్యామ్నాయ రాజకీయాలు.. అనే పేరుతో ప్రజా స్వామ్యం ముసుగులో ముందుకు వచ్చిన సాయుధ పోరా టాన్ని సమర్థించే సంఘాల సమావేశాలకు అనుమతి నిరా కరించడం కావచ్చు, ప్రజా సంక్షేమం కన్నా తమ పార్టీల సంస్థల పట్టింపులే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వాలను బ్లాక్ మెయిల్ చేసే పార్టీల ధర్నాచౌక్‌ల లొల్లులను కావచ్చు., తెలంగాణలో కోట్లు పారించి ఎమ్మెల్యేల ఓట్లను కొని ప్రభు త్వాన్ని పడకొట్టి వచ్చిన తెలంగాణను వో విఫలయత్నంగా మార్చే చంద్రబాబు పన్నిన కుట్రలను కావచ్చు. విద్య వైద్య రంగాల్లో పేరుకు పోయిన నిర్లక్ష్య ధోరణులను ప్రక్షాళన చేయడం గురించిన నిర్ణయాలు కావచ్చు. నిరుద్యోగులను రెచ్చగొడుతూ అలజడులను సృష్టించాలనే కొందరి కుట్రలను నిలువరించడం కావచ్చు., అసెంబ్లీ వేదికగా స్వయంగా గవ ర్నర్ మీద దాడిచేసేందుకు హింసాత్మక ధోరణితో వ్యవహ రించిన కాంగ్రేస్ సభ్యుల మీద కఠిన నిర్ణయాలు తీసుకోవడం కావచ్చు., ఇట్లా ఇంకొన్ని విచ్చిన్న కార్యక్రమాల మీద ఉక్కు పాదం మోపిండు. అట్లా మోపడం ద్వారానే ఇవాల తెలంగాణ నిలవడ్డది. దీన్ని మనం తెలంగాణ ప్రజ ల ప్రయోజనాల నుంచి విశ్లేషించి అర్థం చేసుకోవాల్సి వుంటది.

కొట్లాడి తెచ్చిండు తెలంగాణ. నాలుగేండ్లసంది దేశం లనే నెంబర్ వన్‌గా నిలవెట్టిండు. సాగునీల్లు తాగునీల్లు అం దిస్తున్నడు. ముసలోల్లకు పెద్దకొడుకైండు పెండ్లీడు ఆడబిడ్డ లకు మేనమామైండు తెలంగాణకు పెద్ద దిక్కైండు.. మల్ల కేసీయార్‌నే గెలిపిస్తం.. అంటున్నది తెలంగాణ సమాజం.

నిన్నియాల చంద్రబాబుతో కాంగ్రెస్ పెట్టుకున్న అక్రమ సంబంధాన్ని ఛీకొడుతున్నరు తెలంగాణ ప్రజలు. యీ మాయాకూటమితో ఎన్నికల వరకు సర్వేలు చెప్పిన దానికం టే టిఆరెస్ పార్టీకి మరింత ఆదరణ పెరునున్నదని రుజువు చేయనున్నది తెలంగాణ సమాజం. మల్లా తెలంగాణను దోచుకుందానికి బయలుదేరిన ఆంధ్రా చంద్రబాబు ముఠా ల ఆగడాలను తిప్పికొట్టడానికి... మరో సంపూర్ణ తెలంగాణ ఉద్యమానికి సిద్దమౌతున్నరు. ఆత్మగౌరవమే ఊపిరిగా బతి కే తెలంగాణ బిడ్డలు. రాబోయే ఎన్నికల్లో కేసీయార్ టీఆరెస్ పార్టీని గెలిపించి వలసపాలకుల కుట్రలతో పాటు... మేధా వుల ముసుగేసుకుని దొంగలకు సద్దులు మోస్తున్న తెలం గాణ.. రాజకీయ మేధో బ్రోకర్లను  కూడా తెలంగాణ సమా జం మట్టికరిపించడం ఖాయం.

- తెగువేరా
(తెలంగాణ కోసం నిస్వార్థంగా తమ మేధస్సును, తాత్విక జ్జానాన్ని అందించిన త్యాగధనులైన మేధావులకు వందనాలతో..)

English Title
mathanam article
Related News