మళ్లీ తెరపైకి ఫిక్సింగ్ భూతం

Updated By ManamTue, 10/23/2018 - 04:45
fixing
  • ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాక్ క్రికెటర్లపై అల్ జజీరా ఆరోపణలు   

ఫిక్సింగ్ భూతం క్రికెట్‌ను వదిలిపెట్టడం లేదు. 2000 సంవత్సరం నుంచి ఇది అప్పుడప్పుడూ కనపడుతూనే ఉంది. తాజాగా 2011, 2012లలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లకు చెందిన కొంత మంది క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అల్ జజీరా చానెల్ వెబ్‌సైట్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఐసీసీ తిరస్కరిస్తూనే తగిన ఆధారాలు (ఫూటేజ్) ఇవ్వాలని ఆ చానెల్‌ను కోరింది

న్యూఢిల్లీ: ఫిక్సింగ్ భూతం క్రికెట్‌ను వదిలిపెట్టడం లేదు. 2000 సంవత్సరం నుంచి ఇది అప్పుడప్పుడూ కనపడుతూనే ఉంది. తాజాగా 2011, 2012లలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లకు చెందిన కొంత మంది క్రికెటర్లు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు అల్ జజీరా చానెల్ వెబ్‌సైట్ ఆరోపించింది. అయితే ఈ ఆరోపణలను ఐసీసీ తిరస్కరిస్తూనే తగిన ఆధారాలు (ఫూటేజ్) ఇవ్వాలని ఆ చానెల్‌ను కోరింది. అల్ జజీరా వెబ్‌సైట్ అరోపణల ఆధారం గా ఇంగ్లాండ్‌కు చెందిన క్రికెటర్లు ఏడు మ్యాచ్‌ల్లో, ఆస్ట్రేలియా క్రికెటర్లు, ఐదు మ్యాచ్‌ల్లో, పాకిస్థాన్ ప్లేయర్స్ మూడు మ్యాచ్ ల్లో మిగతా జట్ల క్రికెటర్లు ఒక్కో మ్యాచ్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారు. ‘స్పాట్ ఫిక్సింగ్ కేసులో మాకు సహకరించాలని బ్రాడ్‌కాస్టర్‌ను అడుగుతున్నాం. ఈ కేసు దర్యాప్తులో ప్రసారకర్తల ను కీలకపాత్ర ఉంటుంది’ అని ఐసీసీ యాంటీ కరప్షన్ జీఎం అలెక్స్ మార్షల్ అన్నారు.

image


అయితే స్పాట్ ఫిక్సింగ్‌కు సంబంధించిన ఫూటేజ్ కోసం ఐసీసీ ఎదురుచూస్తోంది. ‘ఆ సాక్ష్యాలను ఇంటర్‌పోల్‌కు ఇస్తా మన్న బ్రాడ్‌కాస్టర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇలాంటి క్రిమినల్స్ ను కూకటి వేళ్లతో పెకలించి స్వచ్ఛమైన క్రీడలను నిర్వహించేందుకు చట్టాన్ని అమలు చేసే ఇతర సంస్థలు మాకు సహకరిస్తాయని భావి స్తున్నాం’ అని మార్షల్ చెప్పారు. ఇండియా-ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన మ్యాచ్, సౌతాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య కేప్ టౌన్‌లో జరిగిన మ్యాచ్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఇంగ్లాండ్-పాకిస్థాన్‌ల మధ్య జరిగిన సిరీస్‌లోని మరికొన్ని మ్యాచ్‌లు స్పాట్ ఫిక్సింగ్‌కు గురైనట్టు చానెల్ ఆరోపించింది. ‘సాధారణంగా పేలవంగా ఆడటం ద్వారా బ్యాట్స్‌మన్ ఫిక్సింగ్‌కు పాల్పడతాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొంత మంది ప్లేయర్స్ బ్యాటింగ్ సమయంలో ఫిక్సింగ్ ఆరోపణలు వస్తాయి. కానీ చాలా మ్యాచ్‌ల్లో అనేక రకాలుగా ఫిక్సింగ్ జరిగింది. మొత్తం 15 మ్యాచ్‌ల్లో 26 ఫిక్సింగ్‌లు జరిగాయి’ అని అల్ జజీరా వెబ్‌సైట్ పేర్కొంది. 2012లో శ్రీలంకలో జరిగిన టీ20 వరల్డ్ కప్ సందర్భంగా అంతర్జాతీయ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, ఉమర్ అక్మల్‌లకు సమీపంలో మ్యాచ్ ఫిక్సర్ అనీల్ మునవర్, అతని సంబంధీకులు తచ్చట్లాడుతు డటం, ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతున్నట్టు దుబాయ్‌లో నివసిస్తున్న ముంబై ఫొటోగ్రఫర్ తీసిన చిత్రాలు అనేక అనుమానాలకు తావిస్తు న్నాయి. అయితే వాళ్లేవ్వరూ తప్పుడు పనులకు పాల్పడలేదని చానెల్ పేర్కొంది. ‘వెబ్‌సైట్ సమాచారాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు చేపడతాం. అయితే అవినీతిని క్రికెట్ సీరియస్‌గా తీసుకోవడం లేదన్న వాదనను పూర్తిగా ఖండిస్తున్నా. అవినీతి రహిత క్రికెట్‌ను కొనసాగించేందుకు గతంలో ఎన్నడూ లేనంత సీరియస్‌గా పనిచేస్తున్నాం. తాజా ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది. దీనితో పాటు మిగతా ఆరోపణలపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ ఆరోపణలపై స్వతంత్ర ప్రొఫెషనల్ బెట్టింగ్ అనలిస్ట్‌ల సహాయం కూడా కోరతాం’ అని మార్షల్ వివరించారు.

ఆరోపణలు ఖండించిన ఇంగ్లాండ్, ఆసీస్ బోర్డులు
లండన్
: అల్ జజీరా చేసిన ఆరోపణలను ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఖండించాయి. ‘అల్ జజీరా మాకు కొద్దిపాటి సమాచారమే ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆ చానెల్ చేసే ఆరోపణల్లో స్పష్టత లేదు, బలం అంతకన్నా లేదు. ఈ ఆరోపణల్లో నిజం లేదని ఇంగ్లాండ్ క్రికెబ్ బోర్డు (ఈసీబీ) ఇంటెగ్రిటీ టీమ్ భావిస్తోంది. ప్రస్తుత లేదా మాజీ క్రికెటర్ల చిత్తశుద్ధిపై ఎటువంటి అనుమానాలూ లేవని పేర్కొంది. అయినప్పటికీ వచ్చిన ఆరోపణలను ఈసీబీ సీరియస్‌గా తీసుకుంటోంది. మాకు చానెల్ ఇచ్చిన మెటీరియల్‌ను ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు పంపుతున్నాం. క్రికెట్‌ను కాపాడుకునేందుకు వారితో కలిసి పనిచేస్తాం’ అని ఈసీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిక్సింగ్‌కు అంగీకరించిన క్రికెటర్లు మ్యాచ్ మొత్తాన్ని అవినీతి మయం చేయలేరు. కానీ అందులోని కొంత భాగాన్ని మాత్రమే ఫిక్సింగ్ చేయగలరు. ఉదాహరణకు ఓ బౌలర్ ఫలానా బంతిని వైడ్ వేయడం ద్వారా లేదా ఫలానా రన్‌రేట్‌తో పరుగులివ్వడం ద్వారా మాత్రమే ఫిక్సింగ్ చేయగలరు. అయితే త్వరలో రిటైర్ కాబోతున్న క్రికెట్ అస్ట్రేలియా (సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ జేమ్స్ 

సూదర్లాండ్ స్పందిస్తూ.. క్రికెట్ స్వచ్ఛతను కలుషితం చేయాలనుకునే వారెవరైనా సహించేది లేదని అన్నారు. ‘మా జట్టులో ఇప్పుడున్న వారిలో గానీ, మాజీల్లో గానీ ఇటువంటి పనికి పాల్పడరు. అల్ జజీరా చానెల్ మాకిచ్చిన 
మెటీరియల్‌ను ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్‌కు అందజేశాం. అయితే ఎటువంటి కటింగ్‌లు లేని వీడియోను, ఇతర సాక్ష్యాలను ఐసీసీ యూనిట్‌కు అందజేయాలని అల్ జజీరాను కోరుతున్నాను’ అని సూదర్లాండ్ అన్నారు.

శ్రీలంక ఫిక్సింగ్ కేసులో భారత్ సహాయం
కొలంబో
: శ్రీలంక క్రికెట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తులో సహాయం చేసేందుకు భారత్ అంగీకరించిందని ఆ దేశ క్యాబి నెట్ మంత్రి, మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ చెప్పారు. క్రికెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసిన ఈ కేసు పూర్వాపరాలు తేల్చేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్‌కు (సీబీఐ) చెందిన సాంకేతిక నిఫుణులను పంపనున్నట్టు శ్రీలంక పెట్రోలియం శాఖ మంత్రి రణతుంగ తెలిపారు. ‘నేను భారత ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశాను. ఆయన వెంటనే స్పందించిన సీబీఐ సిబ్బందిని నాకు పరిచయం చేశారు. ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు మాకు నిపుణులు గానీ, సరైన చట్టాలు గానీ లేవు. ఈ ముసాయిదా చట్టాన్ని రూపొందిచడంలోనూ మాకు సహాయం చేస్తామని భారత్ హామీ ఇచ్చింది’ అని న్యూఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చిన మంత్రి చెప్పారు. 2000 సంవత్సరంలో తొలిసారి మ్యాచ్ ఫిక్సింగ్ వెలుగులోకి వచ్చినప్పుడు అప్పటి కెప్టెన్ రణతుంగ, వైస్ కెప్టెన్ అరవింద డిసిల్వ పేర్లను సీబీఐ పేర్కొంది. కానీ ఆ తర్వాత వాళ్లిద్దరికీ క్లీన్ చిట్ లభించింది. గాల్లే స్టేడియం గ్రౌండ్స్‌మన్ తరంగ ఇండికా, ప్రొఫెషనల్ క్రికెటర్ తరిందు మెండిస్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ నాలుగు రోజుల్లో ఫలితం వచ్చేలా పిచ్‌ను తయారు చేశారనే ఆరోఫణలు ఉన్నాయి. 

English Title
match fixing
Related News