పెరగనున్న మారుతి సుజికీ కార్ల ధరలు

Maruti Suzuki India To Hike Prices From January 2019

న్యూఢిల్లీ : దేశంలో అత్యధికంగా కార్లు తయారు చేసే ప్రముఖ సంస్థ మారుతీ సుజికీ ...  కార్ల ధరను పెంచనుంది. మారుతీ సుజికీలోని అన్ని మోడల్స్‌  కార్ల ధరలు పెరగనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. ధరల పెంపు వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి.  ముడిసరుకుల ధరలు, విదేశీ ఎక్స్ఛేంజ్ రేట్ల ప్రభావం నేపథ్యంలో ధరలు పెంచుతున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.  రూపాయి క్షీణత కారణంగా ముడి పదార్థాల ధరల్లో పెరుగుదల కొనసాగటంతో ధరలు పెంచకతప్పట్లేదని...ఈ నిర్ణయం వినియోగదారులపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు