మూరత్ ర్యాలీని కొనసాగించని మార్కెట్లు

Updated By ManamFri, 11/09/2018 - 22:33
bse
  • సెనెక్స్ 79 పాయింట్లు పతనం

  • 13 పాయింట్లు కోల్పోయిన నిఫ్టి

  • అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పవనాలే కారణం

  • వచ్చే నెలలో పెరగనున్న ఫెడ్ రేట్లు

  • టెల్‌కోలకు రేటింగ్ దెబ్బ.. బలపడిన రూపాయి

bseముంబై: దీపావళి సందర్భంగా జరిగిన మూరత్ ట్రేడింగ్‌లో మార్కెట్లు లాభాలను నమోదు చేసి పండగ వాతావరణాన్ని సంతోషపరిచిన విషయం తెలిసిందే. కాగా, గడిచిన సెషన్‌లో బాంబే స్టాక్ మార్కెట్ సెన్‌సెక్స్ 79.13 పాయింట్లు కోల్పోయి 35,158.55 వద్ద వారంతపు ట్రేడింగ్ ముగిసింది. ఇక జాతీయ స్టాక్ మార్కెట్ నిఫ్టి 13.20 పాయింట్లు నష్టపోయి 10,585.20 వద్ద ముగిసింది. వచ్చే నెలలో వడ్డీ రేట్టు పెరుగుతాయని అమెరికా ఫెడ్ ప్రకటించడంతో మార్కెట్లు ప్రపంచ మార్కెట్లలో ఆటుపోటు ట్రేడింగ్ సాగింది. ఆ ప్రభావం  దేశీయ స్టాక్ మార్కెట్లపై పడటంతో స్వల్ప నష్టాలను మూటగట్టుకున్నాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. కాగా ప్రస్తుతం ఫెడ్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులేదని ప్రకటించింది.   ఇక ఈ రోజు ఉదయం నుంచే నష్టాల్లో ట్రెడ్ అయిన మార్కెట్లు ఒక దశలో 200 పాయింట్లను కోల్పోయి మదుపరులను కలవర పరిచింది. సాయంత్రం వరకు ఫార్మా, ఆటోమొబైల్ రంగాలు కోలుకుకన్నప్పటకి నష్టాలను మాత్రం తప్పించుకోలేక పోయింది. ఇక సోమవారం ప్రకటించే కస్టమర్ ప్రైస్ ఇండెక్స్‌లో ఇంధన ధరలు తగ్గుముఖం పడుతుందని మదుపరులు వేచి చూస్తున్నట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించి. దానికి తోడు ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రభావం కూడా ముడి చమురు ధరలకు తగ్గడానిక మరో కారణంగా దీంతో మార్కెట్లపై సానుకూల ప్రభావమే ఉంటుందని భావిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సెనెక్స్‌లో గడిచిన అన్ని సెషన్‌లో ఎయిర్ భారీగా నష్టపోయింది. ముఖ్యంగా మూడీస్ బీఏఏఏ3 రేటింగ్ ఇచ్చిన కారణంగా కారణంగా ఎయిర్‌టెల్ టాప్ టూజర్‌గా నిలిచింది. బాండ్ రేటింగ్‌లో అత్యల్ప రేటింగ్ కారణంగా 5శాతం నష్టాన్ని మూటగట్టుకుంది. ఇక లూజర్స్ జాబితాలో ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఐటీసీలు 2.15 శాతం నష్టాన్ని నమోదు చేశాయి. మరో వైపు ఎస్ బ్యాంకు అధిక లాభాలను గడించి టాప్ గైనర్‌గా మార్కెట్లో జోరుమీద ఉంది. ఎస్ బ్యాంకు 5.49 శాతం లాభాలను నమోదు చేసింది. ఇదే బాటలో ఏషియన్ పేయింట్స్, అదానీ పోర్ట్, సన్ ఫార్మ, హీరో మోటార్స్ హెచ్‌యూఎల్, మారుతిలు ఉన్నాయి. క్రూడ్ ఆయల్ ధరల్లో సాగుకూలంగా ఉండటంతో దేశీయ విమానయాన సంస్థల షేర్లు కూడా స్వల్పంగా కూడా లాభలందుకున్నాయి. అయిల్ కంపెనీ దిగ్గజాలు హెచ్‌పీసీల్, బీపీసీఎల్, ఆయిల్ ఇండియాలు కూడా లాభాల ర్యాలీని సాగించాయి. మార్కెట్‌లు కొంత సానుకూలంగా ఉండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ 46 పైసలు బలపడి 72.53 వద్ద ముగిసింది. వచ్చే వారం కడా మార్కెట్‌లలో సానుకూల ర్యాలీ ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సానుకూలంగా సాగుతుండటమని మార్కెట్ చెప్పుకొచ్చాయి.

English Title
Markets that do not carry the moorath rally
Related News