మరాఠా మథనం

Updated By ManamFri, 08/10/2018 - 01:34
editorial

 image ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ మరాఠాలు మరోసారి ఆందోళన బాట పట్టారు. మరాఠా సంస్థలు నేడు మహారాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపివ్వడంతో లాతూర్, జల్నా, సోలా పూర్, బుల్దానా జిల్లాల్లో  బంద్ కొనసాగుతోంది. 2016 నుంచి ప్రారంభ మైన మరాఠాల రిజర్వేషన్ శాంతియుతంగా ప్రారంభమై క్రమంగా ఈ ఏడా ది పరాకాష్ఠకు చేరుకుంది. గత నెలలో మరాఠాలు చేపట్టిన ఆందోళన హిం సాత్మకంగా మారింది. పలుచోట్ల జరిగిన ఘర్షణల్లో కొందరు ఆందోళన కారులు ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం చర్చలకు దిగివచ్చింది. రిజర్వే షన్లపై చర్చించి, నవంబర్ నాటికి డిమాండ్లను పరిష్కరించేలా చూస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇవ్వడంతో ఉద్యమ కారులు ఆందోళన విరమించినప్పటికీ  ప్రభుత్వంపై పలు సందేహాలు వ్యక్తం కావడంతో నేడు మరాఠాలు మళ్ళీ ఆందోళన చేపట్టారు. మరాఠా క్రాంతి మోర్చా చేపట్టిన రిజర్వేషన్ ఆందోళన రెండేళ్ళవుతున్న సందర్భంగా గురు వారం రాష్ట్ర బంద్ నిర్వహించింది. మహారాష్ట్రలోనే కాక పూనెలో కూడా ఈ బంద్ ప్రభావం ఉంది. రహదారులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాల యా లు, ఇంటర్నెట్ సేవలన్నీ బంద్ అయినాయి. ప్రభుత్వం సహేతుకమైన పరి ష్కారంతో సకాలంలో స్పందించకపోవడం వల్ల మరాఠాల ఆందోళన మళ్లీ రాజుకుంది. 

ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలకు విద్య సంస్థలు, ఉద్యోగాల్లో  రిజర్వే షన్లపై చట్టబద్ధమైన సంప్రదింపులు imageప్రారంభిస్తామని, ఈ ఏడాది చివరి నాటికి చట్టబద్ధమైన ప్రక్రియలన్నిటినీ పూర్తిచేసి, 2019 చివరి నాటికి అసెం బ్లీలో బిల్లు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గత ఆదివారం ప్రకటించారు. మరాఠాల ప్రధాన డిమాండ్ అయిన 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఫడ్నవీస్ ప్రభుత్వం నిలిపి వేసింది. అదీకాక ముఖ్యమంత్రి హామీలు రాతపూర్వకంగా ఉండాలన్న డి మాండ్‌ను కూడా ప్రభుత్వం ఖాతరు చేయకపోవడంతో గురువారం నుంచి మరాఠా సంస్థలు మళ్ళీ ఆందోళన చేసేందుకు ఏకమయ్యాయి. రాష్ట్ర జనా భాలో 32 శాతంగా ఉన్న మరాఠాలు రాజకీయంగా శక్తిమంతులు. రాష్ట్ర శాస నసభలోను, స్థానిక ప్రభుత్వాలు, పౌర సంస్థల్లో మరాఠాల ప్రాతినిథ్యం గణ నీయంగా ఉంది. 2014లో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) ప్ర భుత్వం వారికి రిజర్వేషన్లు కల్పించినప్పటికీ, బాంబే హైకోర్టు ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఆ కేసు తిరిగి హైకోర్టు పరిశీలనకు వచ్చింది. మరాఠాల వెనక బడినతనాన్ని వివరిస్తూ సమగ్ర నివేదికను రూపొందించవలసిందిగా మహా రాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు కోరింది. కోర్టు ఆదేశాలను పరిగణిస్తూ మరాఠాల ఇబ్బందులపై నివేదిక రూపొందించి కోర్టు సమర్పిం చవలసిన బాధ్యత ఫడ్నవీస్ ప్రభుత్వంపై ఉంది. రిజర్వేషలను డిమాండ్ చేస్తూ మరా ఠా సంస్థలు వేలమందితో రాష్ట్రవ్యాప్తంగా గత రెండేళ్ళ నుంచి 50కి పైగా మౌన ప్రదర్శనలు నిర్వహించి ఉంటుంది. అయితే తమ సమస్యలను పరి ష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏడుగురు మరాఠీలు ఆత్మహత్య చేసుకో వడంతో గత జూలై నుంచి ఉద్యమం హింసాత్మకంగా మారింది. అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని ప్రతిపక్షాలు, ప్రజాస్వామి క వాదుల విమర్శలు సహేతుకమే. 

మరాఠా క్రాంతి మోర్చా (ఎమ్‌కెఎమ్) సంస్థ నుంచి కొందరు విడి పోయి, చిన్నచిన్న మిలిటెంట్ గ్రూపులుగా ఏర్పడి జూలై ఆందోళనా కార్యక్ర మాలలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. ఆ కారణంగా ముంబయి, నవీ ముంబయ్, థానె, పూనె, ఔరంగాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ఎమ్‌కెఎమ్ సంస్థకు చెందిన వందలాది మంది కార్యకర్తలు అరెస్టయ్యారు. 9వ తేదీ నుం చి వరుసగా జరుగబోయే ఆందోళన కార్యక్రమాలు శాంతియుతంగా నడుస్తా యని ఎమ్‌కెఎమ్ సంస్థ హామీ ఇచ్చినప్పటికీ, ఉద్రిక్తతలు ఏర్పడే అవ కాశాలున్నాయని అందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కుల, మత, జాతి, ప్రాంత తదితర అస్తిత్వ ఉద్యమాలు ప్రారంభంలో శాంతియు తంగానే ఉంటాయి. పాలకుల నిర్లక్ష్యం, అప్రజాస్వామిక, అహేతుక వైఖరి కారణంగా ఆ ఉద్యమాలన్నీ హింసాత్మకంగా మారడం కద్దు. ఎవరో పనిగ ట్టుకుని ఇలాంటి ఉద్యమాలను, కుట్రపూరితంగా హింసాత్మకంగా మార్చవల సిన అవసరమే లేదు. అదొక సామాజిక చలన నియమం. దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక, అనుకూల, వర్గీకరణ ఉద్యమాలు పుట్టుకు రావడంతో జాతీయ స్థాయిలో రిజర్వేషన్ల విధానాన్ని, లబ్ధిదారుల వర్గీకరణను పునః సమీక్షించాల్సిన అవసరం ఏర్పడింది. మహారాష్ట్రలో మరా ఠాలతో పాటు రాజస్థాన్‌లో గుజ్జర్లు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు తదితర సామా జిక సమూహాలు రిజర్వేషన్ల కోటా కోసం ఉద్యమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక సామాజిక సమూహాలు వివిధ రూపాల్లో కోటా కోసం ఉద్యమిస్తున్నాయి.

 మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ, రాజకీయ పక్షాలు తమ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం వివిధ సామాజిక సమూహాల ఆశలు, ఆకాంక్షలను సంతృప్తి పరచేందుకు ఆయా కోటాలను పరిమితికి మించి పెంచుతున్నట్లు ప్రకటిస్తుండడమే కాక, శాసనసభల్లో తీర్మానాలు చే స్తున్నాయి. రిజర్వేషన్లపై పరిమితి విధిస్తూ సు ప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అమలుకాని రిజర్వేషన్ కోటాలను కేటా యిస్తూ, న్యాయస్థానాల్లో చుక్కెదురైనప్పుడు పార్లమెంట్‌లో రాజ్యాంగ సవర ణలు చేయాలని అభ్యర్థిస్తూ చేతులు దులుపుకుంటున్నాయి. కోటా కేటాయిం పులు పెంచేందుకు తమ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, రాజ్యాంగ పరిమితుల వల్ల అది సాధ్యం కావడం లేదని ఆయా సామాజిక సమూహాలను బుజ్జగిం చేందుకు రాజకీయ పక్షాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అదే తీరులో సాగుతు న్న మరాఠాల సమస్య సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ అధికార, రాజకీ య పక్షాల ఎన్నికల వ్యూహాలతో మరింత సంక్లిష్టంగా పరిణమించవచ్చు. ముందుగా మరాఠాలు వెనబడిన సామాజిక సమూహమేనని హైకోర్టును ఒప్పించవలసిన గురుతర బాధ్యత ఆ రాష్ట్రప్రభుత్వంపై ఉంది. ఆ తర్వాత రిజర్వేషన్ల కేటాయింపు విధివిధానాలను రూపొందించవలసి ఉంటుంది. 

English Title
Maratha mathanam
Related News