పోలింగ్ వేళ.. మావోయిస్టుల కుట్ర భగ్నం.. 

Maoists, Landmines blast, target Police, election staff, Telangana assembly polls
  • ఎన్నికల సిబ్బంది, పోలీసులు టార్గెట్‌‌గా విధ్వంసానికి కుట్ర

  • భారీగా ల్యాండ్‌మైన్లు అమర్చిన మావోయిస్టులు.. పట్టుకున్న పోలీసులు 

చర్ల: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో విధ్వంసం సృష్టించేందుకు యత్నించిన మావోయిస్టుల కుట్రను తెలంగాణ పోలీసులు భగ్నం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో మావోయిస్టు యాక్షన్‌ టీంను పోలీసులు పట్టుకున్నారు. ఎన్నికల సిబ్బంది, పోలీసులను టార్గెట్‌ చేసి ల్యాండ్‌మైన్లను భారీగా మావోయిస్టులు అమర్చినట్టు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు అప్రమత్తమయ్యారు.

రంగంలోకి దిగిన పోలీసులు మావోయిస్టుల యాక్షన్‌ టీంను అదుపులోకి తీసుకున్నారు. అయితే మావోయిస్టుల యాక్షన్ టీంను రహస్య ప్రాంతంలో పోలీసులు విచారిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Image removed.

సంబంధిత వార్తలు