సింగరేణిలో మావోయిస్టుల పాగా..! 

Updated By ManamFri, 11/09/2018 - 01:21
maoist
  • ప్రభుత్వ కార్యాలయాలకు లేఖలు

  • బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యేకు హెచ్చరికలు

  • అధికార, విపక్ష నాయకుల్లో వణుకు

  • పోలీస్ శాఖ అప్రమత్తం, బలగాల మోహరింపు

imageకరీంనగర్: ఉత్తర తెలంగాణలో ఉనికి చాటుకునేం దుకు మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. చాపకింద నీరులాగా  కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. పోలీసులు మావోయిస్టుల కదలికలపై డేగ కన్ను వేసి పెట్టినా.. అడుగడుగునా జల్లెడ పడుతున్నా.. ఎక్కడో ఓకచోట మావో యిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతు న్నారు. ఉత్తర తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో ఇటీవల ఓ టెలిఫోన్ టవర్‌ను పేల్చివేయడంతో పాటు, పోలీసు ఇన్‌ఫార్మర్ అనే నేపంతో ఓ వ్యక్తిని హతమార్చిన విషయం మరిచిపోకముందే.. కొత్తగా ప్రభుత్వ కార్యాలయాలకు పోస్టు కార్టుల రూపంలో మావోయిస్టులు ఉత్తరాలు పంపించి హడలెత్తిస్తున్నారు.

బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్యకు హెచ్చరిక... 
ఎన్నికల ప్రచారానికి వచ్చే నాయకుల్లారా... తస్మాత జాగ్రత్త అంటూ పలు చోట్ల మావోయిస్టులు తనదైన శైలీలోimage హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల మందుపాతరలు అమర్చి పోలీసులకు కునుకు లేకుండా చేశారు. ఆంధ్రలో మాజీ ఎమ్మెల్యేలను ఇద్దరిని హతమార్చి ఉనికి చాటుకున్న మావోయిస్టులు తెలంగాణ లోనూ అదే రీతిలో ఉనికి చాటుకునేందుకు విఫలయత్నం చేస్తున్నారు. తాజాగా సింగ రేణిలో తమ పాగా వేసేందుకు మావోయి స్టులు ఎత్తకు పైఎత్తులు వేసేందుకు సిద్దమయ్యారు. బెల్లంపల్లి తాజా మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి చిన్నయ్యను హెచ్చరిస్త్తూ సింగరేణి కార్మిక సంఘం పేరిట వాల్ పోస్టర్లు వేశారు. నీ వైఖరి మార్చుకో.. లేకుంటే ఆంధ్రలో ఎమ్మెల్యే కడారికి పట్టిన గతే పడుతుందని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సింగరేణి కోల్‌బెల్టు ఏరియాలో తనిఖీలు, సోదాలు మరింత ముమ్మరం చేశారు. 

మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోల అలజడి.. 
తెలంగాణ, చత్తీస్‌ఘడ్, ఓడిషా సరిహద్దు ప్రాంతాల్లో గత కొంత కాలంగా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. మావో యిస్టులు, పోలీసుల మధ్య ఎదురు కాల్పుల పర్వం కొనసాగుతూనే ఉంది. రెండు రోజుల క్రితం చత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరింత రెచ్చిపోయారు. దంతెవాడ జిల్లా బచెలి అటవీ ప్రాంతంలో బస్సును పేల్చివేశారు. ఈ సంఘటనలో 5 గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్‌తో పాటు మరో పోలీస్ అధికారి, బస్సు డ్రైవర్, కండక్టర్, క్లీనర్‌లు ఈ సంఘటనలో బలైపోయారు. 

ముమ్మరంగా పోలీసుల నిఘా, తనిఖీలు, సోదాలు 
imageఎన్నికల నేపథ్యంలో ఉత్తర తెలంగాణ లో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టుతున్నారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న అభ్యర్థులు, అధికార, విపక్ష నేతలకు ముందస్తు  జాగ్రత్త హెచ్చరికలు జారీ చేస్తు న్నారు. జిల్లాల వారిగా భద్రతపై పోలీసు ఉన్నాధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల మావోయిస్టుల హెచ్చరికలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. సమస్యాత్మక ప్రాంతాల్లోని ప్రముఖుల కదలికలపై నిఘా పెంచారు. మరి కొన్ని ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. రాష్ట్ర పోలీసు శాఖతో పాటు కేంద్ర పోలీస్ బలగాల సహాయాన్ని తీసుకుంటున్నారు. శాంతియుత వాతా వరణంలో ఎన్నికలను సజావుగా నిర్వహిం చేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. కంటికి నిద్ర లేకుండా పోలీసులు తనిఖీలు, సోదాలు చేపడుతున్నారు. 

మావోయిస్టుల టార్గెట్ లిస్టులో ఉన్న రాజకీయ ప్రముఖుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘ పెంచారు. ప్రముఖులు ఎన్నికల ప్రచారం చేసే ప్రాంతాల్లో పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు. మంత్రుల పర్యటనలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యం లో 24 కంపనీలకు చెందిన  55 వేల మంది ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించినట్లు సమాచారం. మావో యిస్టుల కదలికలపై నిఘా వేసి ఉంచారు. మందు పాతరలు, హింసకు పాల్పడే అవకాశాలున్న దృష్ట్యా అన్ని విధాలుగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. 

English Title
Maoists in Singareni
Related News