సినిమాలకు ఎప్పటికీ దూరం కాను..

Updated By ManamTue, 10/23/2018 - 11:34
Manchu Manoj  Shift To Tirupati To Help people
  • సేవా కార్యక్రమాల కోసమే తిరుపతికి వచ్చా

  • మూడు నెలలు ఇక్కడే ఉంటా

  • సంక్రాంతి తరువాత హైదరాబాద్‌కు వెళతా..

  • హీరో మంచు మనోజ్ కుమార్ వెల్లడి

Manchu Manoj  Shift To Tirupati To Help people

చంద్రగిరి : సినిమాలకు ఎప్పటికి దూరం కానని, రాజకీయాలుకు తనకు ఎటువంటి సంబంధం లేదని సినీ హీరో మంచు మనోజ్ అన్నారు. తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్‌లో ఆయన నిన్న (సోమవారం) మీడియాతో మాట్లాడారు. ‘సోషల్ మీడియాలో నేను చేసిన ట్వీట్ ప్రకంపనలు సష్టించింది. సినిమాలకు దూరం అవుతారని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టడానికి హైదరాబాద్ నుండి తిరుపతికి షిఫ్ట్ అవుతున్నాను. తిరుపతిలోనే కొంతకాలం ఉండడానికే వచ్చాను. సినిమాలకు ఎప్పటికీ దూరం కాను, మరో మూడు నెలల్లో కొత్త సినిమా మొదలైవుతుంది. ఈ మూడు నెలల్లో తిరుపతిలో ఉంటూ  సేవా కార్యక్రమాలను చేపడతాను. 

దీనికి సంబంధించిన కార్యచరణను 15రోజుల్లో తెలుపుతాను. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా సేవా కార్యక్రమాలు చేపడుతాను. అమెరికా లాంటి దేశాలు కూడా సేవా కార్యక్రమాలకు ఆహ్వానించే విధంగా కార్యచరణ ఉంటుంది. రాజకీయాలు వేరు, సామాజిక కార్యక్రమాలు వేరు.. మనుషులను వేరు చేసే పరిపాలన మనకొద్దు... ప్రేమ,స్నేహం ఎంత గొప్పవో ప్రజలందరికీ తెలియజేయాలని’ నా అభిమతం అని మనోజ్ అన్నారు.

English Title
Manchu Manoj Shift To Tirupati To Help people
Related News