వీడియో: అయ్యో.. బంగారంలాంటి కారు బుగ్గిపాలైందే..!

Updated By ManamThu, 06/14/2018 - 19:36
new BMW, burning incense, car catches fire, burnt to a crisp

new BMW, burning incense, car catches fire, burnt to a crispబీజింగ్‌: లగ్జరీ కార్లకు ఉన్న క్రేజ్ ఎలాంటి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులోనూ బీఎండబ్ల్యూ కారు అంటే దాని దర్జానే వేరు. ఎన్నో లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారు కొనుక్కోవాలని అందులో తిరిగాలని అందరికీ ఉంటుంది. లక్షలు పోసి ముచ్చటపడి కొనుక్కొన్న బీఎండబ్ల్యూ కారు బూడిదైతే అంతకన్నా దురదృష్టం మరొకటి ఉండదు. చైనాకు చెందిన ఓ వ్యక్తికి కూడా ఇదే అనుభవం ఎదురైంది. కొన్న రోజే తన కళ్ల ఎదుట బంగారంలాంటి బీఎండబ్ల్యూ కారు బూడిదైపోయింది. కొత్త వాహనం కొన్న వెంటనే చాలామందికి దానికి పూజా చేయించడం సర్వసాధారణం. యాంగ్జూ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల 4,70,000 యువాన్లు(దాదాపు రూ.50 లక్షలు) పెట్టి బీఎండబ్ల్యూ కారును కొన్నాడు.

కారు కొన్న రోజే అతడు కారుకు పూజ చేయించి ఎర్రటి వస్త్రం కప్పి దానిపైన అగరబత్తీలు వెలిగించి పెట్టాడు. దాంతో గాలికి నిప్పు రవ్వలు వస్త్రానికి అంటుకున్నాయి. దాంతో మంటలు చెలరేగి ఎంతో మోజుపడి కొనుక్కొన్న కారు.. కొన్న రోజే బూడిదపాలైంది. అయితే మంటలను ఆర్పే లోపే సగానికి పైగా కారు కాలిపోయింది. బంగారం లాంటి తన కారు కాలిపోవడంతో అతడు తల్లడిల్లిపోయాడు. బీఎండబ్ల్యూ కాలిపోతున్న వీడియోను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదే ఆ వీడియో..
 

English Title
Man blesses his new BMW by burning incense, car catches fire, gets burnt to a crisp
Related News