తప్పు దిద్దుకోండి

Updated By ManamSat, 09/22/2018 - 03:44
china-russia
  • అవెురికాకు చైనా ఘాటు హెచ్చరిక

china-russiaబీజింగ్: అగ్రరాజ్యం అవెురికాపై ఆసియా దిగ్గజం చైనా తీవ్రంగా మండిపడింది. రష్యా ఆయుధాలు కొనుగోలు చేసినందుకు తమ సైనిక సంస్థపై విధించిన ఆంక్షలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. అవెురికా వైపు నుంచి కొనసాగుతున్న అర్థరహితమైన పరిణామాల పట్ల చైనా తీవ్ర అభ్యంతరం తెలియజేస్తోందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి గెంగ్ షువాంగ్ మీడియాతో అన్నారు. ఇప్పటికే అవెురికాకు తాము అధికారికంగా నిరసన తెలిపామని గెంగ్ చెప్పారు. అవెురికా విధించిన ఆంక్షలు అంతర్జాతీయ సంబంధాల ప్రాథమిక సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించాయని, ఇరు దేశాలు, ఇరు సైన్యాల మధ్య సంబంధాలను దారుణంగా దెబ్బతీశాయని ఆయన తెలిపారు. అవెురికా తన తప్పును వెంటనే సరిదిద్దుకోవాలని తాము కోరతున్నామని, వాళ్లు విధించిన ఆంక్షలను ఉపసంహరించుకోవాల్సిందేనని, లేనిపక్షంలో వాళ్లు తమ సత్తా చూస్తారని గెంగ్ అన్నారు. 

ఆంక్షలు ఎందుకంటే..
చైనా రక్షణశాఖకు చెందిన పరికరాల అభివృద్ధి శాఖపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్లు అవెురికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. రష్యా నుంచి సుఖోయ్ ఎస్‌యు-35 ఫైటర్ జెట్లు, ఎస్-400 భూమి నుంచి ఆకాశంలోకి వెళ్లే క్షిపణులు కొనుగోలు చేసినందుకు ఈ ఆంక్షలు విధించామన్నారు. సీఏఏటీఎస్‌ఏ ఆంక్షల చట్టం కింద రష్యాతో లావాదేవీలు చేసినందుకు వేరే దేశాన్ని శిక్షించడం ఇదే మొదటిసారని అవెురికన్ అధికారులు తెలిపారు. రష్యాతో ఏ దేశమైనా సంబంధాలు పెట్టుకుంటే వాళ్ల తో తమ సంబంధాలు చెడగొట్టుకోడానికి కూడా ట్రంప్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఆయన పరోక్షంగా పంపారు. ఒకవైపు అవెురికా, చైనాల మధ్య పన్నుల యుద్ధం కొనసాగుతుండగానే మరోవైపు కొత్తగా ఈ ఆంక్షల వ్యవహారం మొదలుకావడం విశేషం.

నిప్పుతో చెలగాటమా: రష్యా
చైనాను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక ఆంక్షలు విధించడం ద్వారా అవెురికా నిప్పుతో చెలగాటం ఆడుతోందని రష్యా తీవ్రంగా స్పందించింది. రష్యా-అవెురికాల మధ్య సంబంధాలను చెడగొట్టేలా అర్థరహితమైన ఆంక్షలు విధించడం అంతర్జాతీయ సుస్థిరతకు మంచిది కాదన్న విషయాన్ని వాళ్లు గుర్తుంచుకోవాలని రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గీ ర్యబ్కొవ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిప్పుతో చెలగాటం ఆడటం ప్రమాదకరంగా మారుతుందని ఆయన అన్నారు. రష్యా నుంచి ఫైటర్ జెట్లు, క్షిపణులు కొనుగోలు చేసినందుకు చైనాపై అవెురికా ఆర్థిక ఆంక్షలు విధించడాన్ని రష్యా తీవ్రంగా పరిగణించింది. రష్యాకు చెందిన 33 నిఘా, సైనిక సంబంధిత సంస్థలను తన ఆంక్షల బ్లాక్‌లిస్టులో పెడుతున్నట్లుగా అవెురికా ప్రకటించింది. వీటిలో సైనిక సంస్థలతో పాటు ఇంటర్‌నెట్ రీసెర్చ్ ఏజెన్సీ లాంటివి కూడా ఉన్నాయి. ఇలాంటి ఆంక్షలు ఎన్ని విధించినా రష్యా మాత్రం తన విధానాన్ని మార్చుకోలేదని ర్యబ్కొవ్ పునరుద్ఘాటించారు. ప్రతిసారీ అవెురికా బ్లాక్‌లిస్టుల జాబితా పెరుగుతూనే ఉందని.. ఇదంతా హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. 2011 నుంచి ఇప్పటికి 60 సార్లు రష్యాకు వ్యతిరేకంగా అవెురికా ఆంక్షలు విధించిందని చెప్పారు.

English Title
Make a mistake
Related News