ఎన్నికల ప్రధాన ఎజెండా ధర్నా చౌక్

Updated By ManamTue, 05/15/2018 - 22:46
dharna-chowk
  • టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

  • రాష్ట్రంలో నియంత పాలన: వరవరరావు

  • ‘ప్రజాగొంతుక ధర్నాచౌక్’ పుస్తకావిష్కరణ

dharna-chowk

హైదరాబాద్ సిటీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ‘ఆక్యుపై ధర్నా చౌక్’ అంశం అన్ని రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోలో ప్రధాన అంశంగా తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం  పిలుపునిచ్చారు. ‘ఆక్యుపై ధర్నాచౌక్’కు ఏడాది అయిన సందర్భంగా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ మంగళవారం ఓ సమావేశం నిర్వహించింది.  ప్రజాగొంతుక ధర్నాచౌక్ కన్వీనర్ చా డ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదండరాంతో పాటు హరగోపాల్, రమావేుల్కొటే తదితరులు పాల్గొన్నారు. తొలుత  ‘ప్రజాగొంతుక ధర్నాచౌక్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను మూసేసింది కానీ, అన్యాయంపై ఉద్యమించే తెలంగాణ వాదుల్లో ధర్నా ఆలోచన రూపమాపలేదన్నారు. ఇందిరాపార్క్ ప్రాంతంలో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించిందని అన్నారు. ప్రస్తుతం ప్రగతి భవన్ ధర్నాచౌక్‌గా మారిందన్నారు. 2019లో ఇదే బలమైన అంశంగా ఉంటుందని, జనసమితికి ఇదే ప్రధాన ఎజెండా అని కోదండరాం స్పష్టం చేశారు. 2019 తర్వాత ధర్నాచౌక్ తెరుచుకుంటుందని, అప్పుడు దాని అవసరం కేసీఆర్‌కే ఎక్కువగా ఉంటుందని కోదం డరాం ఎద్దేవా చేశారు. పౌరహక్కుల జాతీయ నాయకుడు వరవరరావు మాట్లాడుతూ తెలంగాణలో నియంతృత్వ పాలన సాగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్నాచౌక్ ప్రధాన ఆయుధం కావాలని ఆయన ప్రజాసంఘాలకు తెలిపారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కరువయ్యిందని మండిపడ్డారు.  ప్రజాగొంతుక ధర్నా చౌక్ పుస్తకాన్ని చదివి కేసీఆర్ బుద్ది తెచ్చుకోవాలని, ధర్నాచౌక్ విషయంలో నిర్ణ యం తీసుకోవాలని హితవుపలికారు. ప్రొఫెసర్ రమా మెల్కొటే మాట్లాడుతూ స్వేచ్ఛ ను హరించిన ఏ పాలకుడు విజయం సాధించిన దాఖలాలు లేవన్నారు. నియంత పోకడలకు పోతున్న కేసీఆర్ ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆమె మండిపడ్డారు. ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని హరించివేసి ప్రజల గొంతు నులివేుస్తుండని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించిన ధర్నాచౌక్‌ను ఎత్తేసి ఘనకార్యం చేశామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆక్యుపై ధర్నాచౌక్ కో కన్వీనర్ పీఎల్.విశ్వేశ్వరరావు, సాధినేని వెంకటేశ్వర్లు, విమల, రంగారావు, బి.నర్సింగరావు తదితరులు మాట్లాడారు. 

English Title
The main agenda of the election is Dharna Chowk
Related News