'మ‌హాన‌టి'.. ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌

Updated By ManamWed, 05/16/2018 - 16:12
keerthi suresh

keerthy sureshఅల‌నాటి మేటి న‌టి సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేశ్ ప్ర‌ధాన పాత్ర‌లో నటించిన ఈ సినిమాకి నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రియాంక ద‌త్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెర‌పైకి వ‌చ్చింది. తొలి ఆట నుంచే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా..  విడుద‌లైన ప్ర‌తి చోటా మంచి వ‌సూళ్ళు రాబ‌డుతోంది. ట్రేడ్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం.. తొలి వారం రోజులకిగానూ (మంగ‌ళ‌వారం నాటికి) తెలుగు రాష్ట్రాల్లో రూ.10.52 కోట్ల షేర్ రాబ‌ట్టుకున్న ఈ సినిమా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.19.62 కోట్ల షేర్ ఆర్జించింద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల వ‌ర‌కు థియేట్రిక‌ల్ రైట్స్ వాల్యూ ఉన్న ఈ మూవీ.. గురువారం నాటికి ఆ వ‌సూళ్ళు రాబ‌ట్టుకునే అవ‌కాశ‌ముంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. 

English Title
'mahanati' first week collections
Related News