సాయంత్రం ఆరు గంటల తర్వాత మా నిర్ణయం..

Updated By ManamFri, 11/09/2018 - 16:16
Mahakutami: we will decide after 6pm, says chada venkata reddy
  • మహకూటమికి సీపీఐ అల్టిమేటం..

  • కోదండరాంతో సీపీఐ బృందం భేటీ, పొత్తులు, సీట్ల సర్ధుబాటుపై చర్చ

chada venkata reddy met kodandaram

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమిలో సీట్ల సర్ధుబాటు ప్రక్రియ మళ్లీ మొదటికే వచ్చింది. సీపీఐకి మూడు సీట్లు కేటాయిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై సీపీఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను సంప్రదించకుండా సీట్ల కేటాయింపును ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తున్నారు. తాము 9సీట్లు ఇవ్వాలని అడిగామని, అయితే కనీసం అయిదు సీట్లు కూడా కేటాయించకుండా, కేవలం మూడిటితో సరిపెట్టారని సీపీఐ నేతలు సీరియస్‌గా ఉన్నారు. 

ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గం శుక్రవారం అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, మహాకూటమిలో పొత్తు తదిరత అంశాలపై చర్చించారు. భేటీ అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి మాట్లాడుతూ... తమకు అయిదు సీట్లు కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమను సంప్రదించకుండానే సీట్ల కేటాయింపు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. సాయంత్రం ఆరు గంటలక తమ నిర్ణయం ప్రకటిస్తామని చాడా పేర్కొన్నారు. 

మరోవైపు సీపీఐ నేతలు తెులంగాణ జన సమితి కన్వీనర్ కోదండరాంతో భేటీ అయ్యారు. ఒక టీజేఎస్‌కు 8 సీట్లు మాత్రమే కేటాయించడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక హైదరాబాద్ గ్రేటర్‌లో ఒక్క మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మాత్రమే కేటాయించడంతో అక్కడ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ పోటీ చేయనున్నారు.

అలాగే గ్రేటర్‌లో మరో రెండు నియోజకవర్గాలు టీజేఎస్‌కు కేటాయించాలని ఆ పార్టీ నేతలు మహాకూటమిని కోరుతున్నప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమిలో భాగంగా తమకు మొత్తం 12 స్థానాల్లో సీట్లు కేటాయించాలని టీజేఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నప్పటికీ సీట్ల పంపకంలో భాగంగా ఆ పార్టీకి 8 మాత్రమేకేటాయించినట్లు తెలుస్తోంది.

English Title
Mahakutami: we will decide after 6pm, says chada venkata reddy
Related News