పూణె నుంచి మాధురి దీక్షిత్ పోటీ?

Madhuri Dixit to contest from Pune on BJP ticket in 2019 Lok Sabha

న్యూఢిల్లీ : మరో బాలీవుడ్ నటి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ నటి మాధూరి దీక్షిత్...పూణె నుంచి బీజేపీ తరఫున లోక్‌సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.  2019 లోక్‌సభ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఇప్పటి నుంచి అభ్యర్థుల వేటలో పడింది. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసింది.  

బీజేపీ చీఫ్ అమిత్ షా ఈ ఏడాది జూన్‌లో మాధురి దీక్షిత్‌ను ఆమె నివాసంలో కలిశారు. ‘సంపర్క్ ఫర్ సంవిధాన్’ కార్యక్రమంలో భాగంగా ఆమెను కలిసిన షా...నరేంద్ర మోదీ సర్కార్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన  బీజేపీ నేత మాట్లాడుతూ... పూణె లోక్‌సభ నుంచి పోటీ చేసే లిస్ట్‌లో ఆమె పేరు ఉన్నట్లు తెలిపారు. ఈ విషయంలో పార్టీ అధిష్టానం కూడా సీరియస్‌గా యోచిస్తోందని తెలిపారు.  ఇక్కడ నుంచి మాధురిని నిలబెట్టడం అన్నివిధాలా సరైన నిర్ణయమని అన్నారు. కాగా 2014 ఎన్నికల్లో బీజేపీ నుంచి అనిల్ షిరోల్...కాంగ్రెస్ అభ్యర్థిపై మూడు లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.

సంబంధిత వార్తలు