యశోదా నుంచి మాధవి డిశ్చార్జ్

Updated By ManamWed, 10/17/2018 - 17:23
Madhavi discharge from yashoda hospital

Madhavi discharge from yashoda hospital

హైదరాబాద్ : ప్రేమ పెళ్లి చేసుకుని, తండ్రి చేతిలో దారుణంగా గాయపడ్డ మాధవి ఎట్టకేలకు యశోదా ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయింది. బోరబండకు చెందిన మాధవిపై గత నెల 19న కన్న తండ్రి మనోహరాచారి దాడి చేసిన విషయం తెలిసిందే.  ప్రేమ వివాహం చేసుకున్న మాధవి, ఆమె భర్త సందీప్‌పై వేట కొడవలితో మనోహరాచారి విచక్షణారహితంగా దాడి చేశాడు.

ఈ ఘటనలో సందీప్ స్వల్ప గాయాలతో తప్పించుకోగా, మాధవి తీవ్రంగా గాయపడింది. చెవి, కుడిచేయికి తీవ్ర గాయాలు అయ్యాయి. అప్పటి నుంచి మాధవి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని యశోదా వైద్యులు తెలిపారు.

కాగా కన్నకూతురిపై దాడి చేసిన మనోహరాచారి ప్రస్తుతం జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌‌ను కోర్టు తోసిపుచ్చింది.

English Title
madhavi discharge from yashoda hospital
Related News