ఆరో తరం పాలేరు రాసిన ‘మా ఎర్ర ఓబన్నపల్లె’

Updated By ManamSun, 10/21/2018 - 09:37
novel

భారతదేశానికి ఉన్న సాహిత్య చరిత్రకు నేడు ఎంతో ప్రాధాన్యతవుంది. అందునా మరీముఖ్యంగా దళిత సాహిత్యం విజృంభించిన తర్వాత దేశ సాహిత్య ఘపత ఖండంతారాలు దాటిందనే చెప్పాలి. దళిత సాహిత్యం ప్రధానంగా సమానత్వం కోసం తన ప్రశ్నలను తిరుగుబాటుగా సంధిస్తోంది. పూలే, అంబేడ్కర్, పెరియార్ తెలుగు ప్రాంతాల్లోనైతే దున్న ఇద్దాస్, గుర్రం జాషువా మహనీయుల వారసత్వంలో అనేక వందలమంది రచయితలను కలిగిన జాతి దళిత జాతనే చెప్పాలి. వీరి రచనలకు భూమికగా కల్పిత పాత్రలతో కూడిన గాథలుండవ్ స్వీయ అనుభవంలో నుండి పుట్టిన సార్థకబాధలే అక్షరాలై పాఠకులకుతో పాటు సమాజానికీ ఓ కొత్త వరవడి  నేర్పుతూ ప్రజాజీవన ప్రజాస్వామికంలో భాగస్వామ్యం అవుతాయి వీరి అక్షరాలు. ఇందులో భాగంగానే సుమారు రెండువందల సంవత్సరాల నుండి తమ కులాలవారు మరీ ముఖ్యంగా తమవంశం ఎలా పాలేరుతనం పాలైందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు రచయిత ఎజ్రా శాస్త్రి. మూడు దశాబ్దాలుగా సాహితీరంగంలో ఉన్న మేధావి ఈయన. 

imageఎన్నో త్యాగాలు చేసిన మాదిగల పేరును కుట్రలు అధిగమించి తమ పేరున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాయి. అవి భూములైనా ఊరిపేర్లు అయినాసరే కాని 200 ఏళ్ల క్రితం రాయలసీమ ప్రాంతం నుండి వలసొచ్చిన ఎర్ర ఓబయ్య అనే మాదిగ పేరు మీదుగా ఓ గ్రామం నేటికి నిల్చివుండటానికీ ఎంతో సామాజిక పోరాట చరిత్ర దాగివున్నది. ఆ చరిత్రనే తన కలంతో తవ్విన రచయిత దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి.  పుస్తక విషయానికి వస్తే ‘మా ఎర్ర ఓబన్నపల్లే’ అనే నవలగా మనముందున్న వందలమంది మాదిగల వందలనాటి యథార్థ సంఘటన. రాయలసీమ అంటే కరువు కాటకాలకు నిలయమనే నేటికి అక్కడి పరిస్థితులు అద్దం పడ్తాయి. యలమంద అనే మాదిగ తన కుటుంబాన్ని పోషణ కొరకు  అడవికి పోయేవాడు. అడవిమృగాలు దాడిచేసి చంపిన పశువుల కళేబరాలను ఇతడు వెదికివెదికి వాటికుండే ‘గోరో జనం’(చేదు)ను ఇంటికి తీసుకు వచ్చి నాటువైద్యం కొరకు అమ్మి జీవనం కొనసాగించేవాడు.

కళేబరాల మాంసం మంచిగావుంటే అదే ఆ రోజుకి మంచి ఆహారంగా స్వీకరించేది యలమంద కుటుంబం. గొడ్డుచేదును ఎండబెట్టి దానిని వేడివేడి ఆముదపు నూనెలోగానీ, కొబ్బరినూనెలోగాని కలిపి వాటికి వెల్లుల్లిని, ఇంగువను కలిపి నొప్పివున్న చోట రాసుకున్నప్పుడు తక్షణమే ఉపశమనం ఇచ్చేశక్తి ఆ గోరోజనానికి ఉంటుంది. బతుకుదెరువు కోసం అసాముల వద్ద పాలేరుగా జీతం కొనసాగించిన నేపథ్యమే ఈయన తర్వాతి తరాలకు జీవనాధారమైందనే చెప్పాలి. దుగ్గినపల్లివారి వంశంలో యలమంద మొదటి తరం. ఈయన చాలా అందగాడు. ఈయన కుమారుడే ఎర్ర ఓబన్న. తండ్రికి తగిన అందగాడు. రెడ్డి ఆసాముల వద్ద పాలేరుగా జీవనం సాగించి కరువు తాండవించడంతో తన మిత్రుడు, యజమాని అయిన నర్సిరెడ్డితో కలిసి ప్రకాశం జిల్లాకు వలసవొస్తడు. అంతకుముందు వ్యవసాయంలో రెడ్డిదో ఎద్దు అయితే రెండవ ఎద్దు ఎర్ర ఓబన్నదే. వలసొచ్చినకాడ ఓ ఆసామి ఊరికే జ మిందారి అయిన పెదిరెడ్డితో తామొచ్చిన పరిస్థితిని వివరించారు.

తమకు ఆసరా చూపించమనీ ఉండేందుకు జాగా ఇప్పించాలని, వ్యవ సాయానికి కొంతభూమిని దానంగా ఇవ్వాలనే అభ్యర్థనను పెదిరెడ్డి తోసిపుచ్చుతాడు. నర్సిరెడ్డి చేసేది ఏమిలేదురా పోదాం పదరా అంటడు. అప్పుడు ఓబయ్య నే పోయేది యాడికి లేదు మనం ఇక్కడే స్థిరపడిపోదామంటడు. అన్నదే తడువుగా తమ కుటుంబాలకు తోడుగా ఓ రెండు కుటుంబాలు మాలలవి, మరో రెండు కుటుంబాలు ముదిరాజులవి,  గొల్లలవి కలుపుకుని సబ్బండజాతులతో ఒక ఊరికే తొలిపునాది వేసిండు ఓబయ్య. ఈ గ్రామానికి పేరేమి పెట్టాలని భూ స్వామితో పాటు నర్సిరెడ్డి ఓబయ్య కలిసి ఎరుక చూసిన ఎర్కల ఆడమన్సి ఈ ఊరికి ఎర్ర ఓబన్న పల్లే అని పేరుపెట్టండిరా... బలంగా ఉంటదనీ చెప్తది. దేవత వాక్కుల భావించిన రెడ్లు కూడా ఏమి మాట్లాడకపోతారు. వ్యవసాయం కోసం భూమి కావాలంటే కౌలు చెల్లించాలనీ కిరికిరి పెట్టిండు పెదిరెడ్డి. వానలే లేవు పంట వొస్తదో రాదో నమ్మకం లేని ఓబయ్య, నర్సిరెడ్డి అల్లంత ఎత్తున వున్న గుట్టమీది అడవికి కట్టెల కోసం పోతారు. కొండపైకి పోయినపుడు కొండపై విశాలంగా సుమారు 20 ఎక రాల విస్తీర్ణంలో భూమి కనబడుతుంది. అక్కడ ఉన్న బండసెలిమెల నీటితో వందబస్తాల పంటదిగుబడిని తీస్తారు ఓబయ్య, నర్సిరెడ్డి కలిసి. కుట్రపన్నిన పెదిరెడ్డి నర్సిరెడ్డికో మూడెకరాల భూమిని దానంగా ఇచ్చి మాదిగోడితో నీకు పొత్తు ఏందనీ హితవు చెప్పి ఇడదీసిండు. ఓబన్న ఒంటరోడయ్యిండు.

ఊరు నానాటికీ పెరుగుతూ 150 కుటుంబాలు అయినయ్. ఈ నేపథ్యంలో ఊరి భూస్వామి నుండి ఇంకా దాడులు... కొండమీద భూమి కోల్పోయినప్పటికి అంతో ఇంతో వ్యవసాయాన్నీ చేసుకునేందుకు కొంచెం భూమి సాధించుకున్నప్పటికీ నర్సిరెడ్డి కింద పాలేరుగానే ఉన్నాడు. కాలక్రమేణా వయసు మీదపడిన ఎర్ర ఓబయ్య కాలం చేసిండు (ఇది రెండవతరం). తన వారసత్వం కొడుకు ఎర్ర చెన్నయ్య నిలబెట్టిండు. ఉన్నతకులాలనుండి వచ్చే దాడులను తండ్రికివోలే ఎదురునిలబడి కులానికేకాక ఊరుకే అండగా ఉన్నడు. అనేకమార్లు కేసులు కోర్టుల చుట్టూ తిరిగి కులాన్నీ నిలబెట్టిండు. ఈయనకు ‘కురేషి’ అనే చదువుకున్న మాదిగ యువకుడు అండగా వున్నడు ఒకరకంగా చెప్పాలంటే కురేషి భక్తి ఉద్యమకారుడనే చెప్పాలి. ఆనాటి బ్రాహ్మణ, కరణం, మున్సబు కులాల దోపిడిని ప్రశ్నించిన మాదిగవీరుడు కురేషి. ఓర్వలేని ఆధిపత్యకులాలు తనకు తానుకు జీవసమాధి అయ్యేలా ప్రేరేపించింది. ఎర్ర చెన్నయ్య తన కులానికీ మరింత అండగా నిల బడ్డడు. వందల కవిత్వాలను రాసిన ఎజ్రాశాస్త్రి తమ వంశం పాలేరుగా ఎలా కొనసాగుతూ తనదాక వొచ్చిందో మొదటి నవల ద్వారా ప్రపంచం ముందు ఉంచాడు. 

రెడ్లవద్దనే పాలేరుగా ఎర్రచెన్నయ్య జీవనం సాగిస్తూ కాలంచేసిన తర్వాత ఆ పరంపరను ఆయన కొడుకు బాల నర్సు కొనసాగిస్తడు. బ్రిటిష్ దొరల పాలనలో గూడెంలోకి క్రైస్తవంతో పాటు విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. చదువులు నేర్సిన బాలనర్సు కొడుకు రాజు రెడ్లవద్ద పాలేరు అయినప్పటికీ తెల్లదొరల ప్రోత్సాహంతో సైనికునిగా దేశం తరపున పోరాటం చేస్తడురాజు (ఐదోతరం). దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వీరోచితంగా పోరాడిన మాదిగల పోరాటతత్వాన్నీ మరుగు పర్చిన కుహానా మేధావులకు సవాలు విసురుతుంది ఈ నవల. యుద్ధానంతరం  గ్రామానికీ చెరుకున్న రాజు గ్రామంలో జరిగిన ఆధిపత్య కులాల దాడులపై  పోరాటం కొనసాగించాడు. తదనంతరం నాటకీయ పరిణామాల నడుమ కులవృత్తిని నమ్ముకుని నందికొండ సాగర్ డ్యాం నిర్మాణంలో కూలివాళ్ళకు చెప్పులు కుడుతూ తన కుటుంబాన్నీ కూలిపని వారిగా చేర్పిస్తడు. రాజు పెద్దకొడుకు రెడి ్డసమాజికవర్గానికీ చెందిన అమ్మాయిని ప్రేమించడం, తన పంతాన్ని గెలిపించుకున్న ఆధిపత్యాన్ని రచయిత చెప్పిన తీరు కంటతడి పెట్టిస్తుంది. అక్కడే అంటెడంర్‌గా ఉద్యోగం పొందినరాజు పిల్లలకు చదువు చెప్పించడం మొదలుపెట్టిండు. 

-  గుండెపొంగు వరకుమార్ 
 (నేడు మార్కాపురంలో ‘మా ఎర్ర ఓబన్నపల్లె’ నవల ఆవిష్కరణ)

English Title
maa erra obanne palle
Related News