ప్రేమికులారా జాగ్రత్త అంటూ సూసైడ్..

Updated By ManamWed, 07/11/2018 - 11:52
suicide

suicide

విజయవాడ:  ప్రేమలో విఫలమయ్యానంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ గవర్నర్ పేటలోని ఓ లాడ్జిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ యువకుడు తెనాలికి చెందిన వంశీకృష్ణగా పోలీసులు గుర్తించారు. ప్రేమ, ఓ యువతి వల్ల తన జీవితం నాశనం అయిందంటూ వంశీకృష్ణ సూసైడ్ నోట్‌ రాశారు. దాంతో పాటు రెండు గంటల నిడివితో ఓ వీడియోను చేసి అందులో యువత ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ సూచించాడు. 

అయితే పనిమీద మంగళవారం ఉదయం విజయవాడకు వచ్చినట్లు చెప్పుకున్న వంశీకృష్ణ, లాడ్జిలో రూమ్ తీసుకొని అక్కడే ఉన్నాడు. గదిలోకి వెళ్లిన అతడు కొన్ని గంటలైనా బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది తలుపు తట్టి చూడగా స్పందన రాలేదు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలపులు పగులగొట్టి చూడగా.. వంశీకృష్ణ విగతజీవిగా కనిపించాడు. దీంతో కేసు నమోదు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

English Title
Love Failure: Young man committed suicide
Related News