నష్టాల్లో సూచీలు

Updated By ManamTue, 05/15/2018 - 22:47
market

marketముంబయి: కర్ణాటక శాసన సభ ఎన్నికల ఫలితాలు మంగళవారంనాడు స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపాయి. బొంబాయి స్టాక్ ఎక్చ్సేంజి (బి.ఎస్.ఇ) 30 షేర్ల సున్నిత సూచి చివరికొచ్చేసరికి ఇంట్రా-డేలో చూసిన అత్యధిక స్థాయి 35,993.53లో 437 పాయింట్లను కోల్పోయింది. జనతా దళ్ (సెక్యులర్)తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రకటించడంతో మార్కెట్లలో అంతకుముందు ఉప్పొంగిన ఉత్సాహం చల్లారింది. కర్ణాటకలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల స్థితిలో భారతీయ జనతా పార్టీ (బి.జె.పి) అవతరించగలదని ఎన్నికల ఫలితాల సరళి సూచించడంతో మొదట్లో మార్కెట్లు పెరిగాయి. కర్ణాటకలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో జె.డి (ఎస్)కు మద్దతు ఇవ్వగలమని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ అందరినీ ఆశ్చర్యపరచింది. వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తిరిగి ఎన్నికయ్యేందుకు ఈ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని, ఉద్వేగాన్ని అందిస్తాయని, మరిన్ని సంస్కరణలకు ద్వారాలు తెరచుకుంటాయని భావిం చారు. దాన్ని మార్కెట్లకు సానుకూల పరిణామంగా ఇన్వెస్టర్లు భావించారు. పరిస్థితి మారడంతో, బి.ఎస్.ఇ ‘సెన్సెక్స్’ నామమాత్రపు 12.77 పాయింట్ల నష్టంతో 35,543.94 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్చ్సేంజి (ఎన్.ఎస్.ఇ) 50 షేర్ల సూచి ‘నిఫ్టీ’ 4.75 పాయింట్ల స్వల్ప నష్టంతో 10,801.85 వద్ద ముగిసింది. సెషన్ ప్రారంభంలో రెండు సూచీలు 1 శాతం పైగా పెరిగి గత మూడు నెలల్లో ఎన్నడూ ఎరుగనంత అత్యధిక స్థాయిలను తాకాయి. ఇంట్రా-డేలో ‘నిఫ్టీ’ 10,926.60 పాయింట్ల స్థాయిని తాకింది. టాటా మోటార్స్ లిమిటెడ్ షేర్ ధర 4.2 శాతం పైగా తగ్గి, రెండేళ్ళ కనిష్ఠ స్థాయిలో ముగిసింది. 

Tags
English Title
Losses in losses
Related News