24 గంటల్లోగా రుణమాఫీ

Updated By ManamFri, 05/25/2018 - 22:21
BS-Yedurappa
  • రూ. 53వేల కోట్ల మేర పంట రుణాలు.. మాఫీ చేస్తామని ఎన్నికల్లో జేడీఎస్ హామీ

  • ఇప్పుడు వెంటనే రుణమాఫీ చేసి తీరాలి.. ఎల్లుండి కర్ణాటక బంద్: యడ్యూరప్ప

BS-Yedurappaబెంగళూరు: రైతు రుణాలను 24 గంటల్లోగా మాఫీ చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళన చేస్తామని కర్ణాటక ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప హెచ్చరించారు. సీఎం కుమారస్వామి విశ్వాస పరీక్షకు ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులు తీసుకున్న దాదాపు రూ. 53 వేల కోట్ల పంట రుణాలను మాఫీ చేస్తామని జేడీఎస్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని.. అందువల్ల 24 గంటల్లోగా మాఫీ చేయాల్సిందేనని డిమాండు చేశారు. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి సమస్యలుంటాయంటూ కాకమ్మ కథలు చెబితే వినడానికి కన్నడ ప్రజలు సిద్ధంగా లేరని ఆయన తెలిపారు. ప్రత్యేక సమావేశాల్లోనే రుణమాఫీని ప్రకటించాలని.. లేకపోతే తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని యడ్యూరప్ప హెచ్చరించారు. బీజేపీ పోరాటమంతా రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, అవినీతితో నిండిన కుమారస్వామి ప్రభుత్వం మీదేనని ఆయన స్పష్టం చేశారు. కుమారస్వామి ప్రభుత్వం అవినీతి మయం అవుతుందనడానికి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. పార్టీలో ‘సూట్‌కేసు’ లేకుండా ఏ పనీ కాదని అతడు అన్నాడన్నారు. జేడీఎస్ ప్రభుత్వమంతా అవినీతిమయంగానే ఉంటుందని, ప్రజా ప్రయోజనాల గురించి ఎవరూ పట్టించుకోరని ఆయన చెప్పారు. సాగునీటికి వాళ్లు ప్రాధాన్యం ఇవ్వరని చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర  బంద్‌కు తాము పిలుపునిస్తున్నామని, ప్రజలు తమ పిలుపును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

English Title
Loans within 24 hours
Related News