లార్సెన్ అండ్ టూబ్రోకు రూ. 1,904 కోట్ల ఆర్డర్లు

Updated By ManamThu, 08/09/2018 - 23:22
larsen and toubro

l-and-tన్యూఢిల్లీ: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నిర్మాణ విభాగం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లలో రూ. 1,904 కోట్ల ఆర్డర్లు దక్కించుకున్నట్లు ప్రకటించింది. విద్యుత్ ప్రసారం, పంపిణీకి సంబంధించిన రూ. 1,723 కోట్ల విలువ గల పలు ఆర్డర్లను పొందినట్లు కంపెనీ పేర్కొంది. ‘‘కింగ్‌డం ఆఫ్ మోరాకోలోని మిడెల్ట్ ప్రాంత విద్యుత్ స్టేషన్ నుంచి విద్యుత్ ప్రసార లైన్ల నిర్మాణానికి కంపెనీ ఒక ఆర్డరును దక్కించుకుంది ’’ అని ఎల్ అండ్ టీ బి.ఎస్.ఇకి నివేదించింది. అదే విధంగా ఈజిప్ట్‌లో ఓవర్‌హెడ్ ట్రాన్స్‌మిషన్ లైన్‌లను నిర్మించేందుకు ఎలక్ట్రిసిటి ట్రాన్స్‌మిషన్ కంపెనీ నుంచి మరో ఆర్డరు పొందినట్ల్లు ఎల్ అండ్ టీ తెలిపింది. అల్జీరియాలోని అన్నాబ నగరంలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్ స్టేషన్‌ను కంపెనీ నిర్మించనుంది. నేపాల్ ఎలక్ట్రిసిటి అథారిటీ నుంచి ఆర్డరును పొందింది. ఈ ఆర్డరులో 220 కిలోవాట్ సబ్‌స్టేషన్ డిజైన్, సరఫరా, స్థాపన, పరీక్షించడం, ప్రారంభించడం వంటి అంశాలున్నాయి.  ఇండియాలో కూడా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా లైన్లు, సబ్-స్టేషన్‌ల నిర్మాణానికి ఒక ఆర్డరును పొందింది. తమిళ నాడులో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటుకు మరో ఆర్డరును ఎల్ అండ్ టీ చేజిక్కించుకుంది. జమ్ము, బిహార్, ఝార్ఖండ్,  ల నుంచి కూడా కంపెనీ ఆర్డర్లు అందుకుంది. గోవా ఇంటెలిజెంట్ సిటీ మేనేజ్‌మెంట్ సిస్టం అమలుకు రూ. 181 కోట్ల ఆర్డరు పొందింది. 

English Title
Larsen and Toubro Rs. 1,904 crore orders
Related News