లేడీ డాన్ నమిత

Updated By ManamThu, 07/12/2018 - 01:40
namitha

imageవిభిన్న చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధ హస్తుడైన టి.రాజేందర్ చాలా గ్యాప్ తర్వాత దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఓ భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ‘ఇన్నైయ కాదల్ డా’ అనే టైటిల్‌తో రూపొందే ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, పాటలు, సంగీతం, ఛాయాగ్రహణ పర్యవేక్షణ, దర్శకత్వం బాధ్యతలను టి.రాజేందర్ చేపడుతున్నారు.

‘‘ఈ సినిమాలో నమిత లేడీ డాన్‌గా నటించనుంది. ఆమెతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటిస్తారు. అలాగే కొంతమంది కొత్తవారిని కూడా ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. పూర్తి యూత్‌ఫుల్ లవ్‌స్టోరీగా ఈ చిత్రం రూపొందుతుంది. ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టుగా సినిమాలో ప్రేమ తప్ప మరో అంశం కనిపించదు. ఇలాంటి సినిమాలో లేడీ డాన్ పాత్ర ప్రాధాన్యం ఏమిటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతగా ఉషా రాజేందర్, సహాయ నిర్మాతగా ఫరూక్ పిక్చర్స్ టి.ఫరూక్ వ్యవహరిస్తున్నారు.

English Title
Lady Don Namita
Related News