ఉత్తమ్ సమస్యకు స్పందించిన కేటీఆర్ 

Updated By ManamWed, 06/13/2018 - 10:30
ktr, uttam

ktr హైదరాబాద్: సామాజిక మాధ్యమాల ద్వారా తన వద్దకు వచ్చిన సమస్యలను పరిష్కరించే వారిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒకరు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు తన వద్దకు తీసుకొచ్చే సమస్యలకు ఆయన సమాధానం ఇస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన వద్దకు తీసుకొచ్చిన సమస్యపై స్పందించిన కేటీఆర్, దానిని పరిష్కారం చేసినట్లు చెప్పారు.

అయితే కొమరం భీమ్ అసిఫాబాద్‌ జిల్లాలో ఓ గుడిసెలో ఉంటున్న ఇద్దరు వృద్ధ దంపతులకు 500రూపాయల ఇంటి పన్నును ప్రభుత్వ అధికారులు వేశారు. దానికి సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఉత్తమ్.. ఆ వృద్ధ దంపతులను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, వారి నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేసి, డబుల్ బెడ్‌రూం ఇంటిని ఇవ్వాలని కేటీఆర్, తెలంగాణ సీఎంఓలను కోరారు. దానికి స్పందించిన కేటీఆర్.. సమస్యను తన వద్దకు తీసుకొచ్చిన ఉత్తమ్ కుమార్‌కు థ్యాంక్స్ చెబుతూ దీనిపై స్పందించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆ తరువాత కేటీఆర్ ట్వీట్‌కు స్పందించిన జిల్లా కలెక్టర్ వారి డబ్బులను నాలుగు రోజుల క్రితమే తిరిగి ఇచ్చేశామని, అలాగే వారికి పెన్షన్, డబుల్ బెడ్‌రూం ఇంటిని కూడా విడుదల చేశామని తెలిపారు. ఇక ఈ విషయాన్ని ఉత్తమ్‌కు తెలిపిన కేటీఆర్ ఒకసారి మీరు చెక్ చేయండి అంటూ సమాధానం ఇచ్చారు.

 

 

English Title
KTR responds to Uttam Kumar Reddy in Social Media
Related News