అవార్డును అమ్మేయనున్న విజయ్.. ప్రశంసించిన కేటీఆర్

Updated By ManamMon, 06/18/2018 - 10:53
Ktr, vijay

vijay, ktr దక్షిణ భారత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన 65వ ఫిలింఫేర్ అవార్డు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అందులో ఉత్తమ నటుడిగా తొలి ఫిలింఫేర్‌ను అందుకున్నాడు సెన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆనందాన్ని వ్యక్తం చేసిన విజయ్.. ఈ అవార్డును ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇవ్వనున్నట్లు ప్రకటించాడు.

‘‘నా ఇంట్లో సెల్ఫ్ మీద ఉండటం కంటే నేను పుట్టిన ఈ సిటీకి ఈ అవార్డు ద్వారా వచ్చే సొమ్ము అవసరం అవుతుంది’’ అని తెలుపుతూ విజయ్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. తనకు ఎందుకో ఇలా చేయాలని అనిపించదని అందుకే కమిట్ అయ్యాయని విజయ్ ఈ సందర్భంగా తెలిపాడు. ఇక దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్.. ‘‘నీ మొదటి ఫిలింఫేర్ అవార్డుకు కంగ్రాట్స్. నువ్వు ఈ అవార్డును ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇస్తానని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. నీ ఆలోచనా తీరుకు అభినందిస్తున్నా. అవార్డును ఎలా వేయాలో దానికి సంబంధించిన విషయాలను చెబుతాను’’ అంటూ కామెంట్ పెట్టారు. 


 

English Title
KTR praises on Vijay Devarakonda's decision
Related News