నాగోల్-ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం

Updated By ManamFri, 08/10/2018 - 13:42
KTR

KTR inaugurated the flyover at Kamineni Hospital junction in LB Nagarహైదరాబాద్ : నగరవాసులకు మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు నిర్మించిన ఎల్బీనగర్‌లోని కామినేని జంక్షన్ వద్ద నూతనంగా నిర్మించిన నాగోల్-ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ను రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ మెగా సిటీగా అవతరించిందని, దానికి అనుగుణంగా నగరం అభివృద్ధి చెందాలంటే ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపర్చాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రజా రవాణా వ్యవస్థ బాగుపడితేనే ట్రాఫిక్ సమస్యను అధిగమించే అవకాశం ఉందని, ప్రజలు బాగుండాలన్నదే ప్రభుత్వ ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. రూ.23 వేల కోట్లతో నగర అభివృద్ధి ప్రణాళిక చేపట్టామని, రూ.9వేలకోట్ల విలువైన పనులు జరుగుతున్నాయన్నారు. కాగా షెడ్యూల్ ప్రకారం ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం బుధవారమే కావల్సి ఉన్నప్పటికీ అదే రోజు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతి చెందడంతో ఆరోజు జాతీయ సంతాప దినంగా ప్రకటించడంతో ఈ కార్యక్రమం చివరి నిమిషంలో వాయిదా పడింది.

English Title
KTR inaugurates flyover at Kamineni Hospital junction in LB Nagar
Related News