దుర్గగుడి ఈవోగా కోటేశ్వరమ్మ

Updated By ManamFri, 08/10/2018 - 15:51
Kanakadurga-temple
kanaka durga temple

విజయవాడ : దుర్గమ్మ ఆలయంలో అమ్మవారి చీర మాయమైన ఘటన కలకలం రేగిన విషయం తెలిసిందే. గతంలో ఆలయంలో తాంత్రిక పూజలు జరిగినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. వరుస వివాదాల నేపథ్యంలో దుర్గమ్మ ఆలయ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల ఆలయ కార్యనిర్వహణాధికారిగా ఉన్న పద్మకుమారిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో  కేంద్ర సర్వీస్ నుండి రాష్ట్రసర్వీసుకి డెప్యూటేషన్‌పై వచ్చిన కోటేశ్వరమ్మను నియమించారు.

అంతేకాకుండా ఆలయ కమిటీ సభ్యులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. కాగా ఆలయ కమిటీ సభ్యులు కేవలం సలహాలు, సూచనలకే పరిమితం చేసి, వారిని పాలక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని రాష్ట్ర సర్కార్ సూచించినట్లు తెలుస్తోంది.

English Title
Koteswaramma new EO of Durga temple
Related News