కేసీఆర్‌‌ సవాల్‌కు కోమటిరెడ్డి రియాక్షన్

Updated By ManamSun, 06/24/2018 - 21:26
Komatireddy Reaction On CM KCR Challange

కేసీఆర్‌‌ సవాల్‌కు కోమటిరెడ్డి రియాక్షన్

హైదరాబాద్: ‘ముందస్తు ఎన్నికలకు నేను రెడీ.. మీరు రెడీనా’ అంటూ కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. అయితే ఈ సవాల్‌కు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. దమ్ముంటే రేపు బర్త్‌రఫ్ చేయాలని కేసీఆర్‌కే కోమటిరెడ్డి రీ-సవాల్ విసిరారు. మా పార్టీ ఎన్నికలకు అధిష్టానాన్ని కూడా ఒప్పిస్తామన్నారు. ఇదే విషయమై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సోమవారం లేఖ రాస్తానని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. త్వరలో సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని ఒప్పిస్తామని ధీమా వ్యక్తం చేశారాయన. సీఎం సవాలును స్వీకరించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. 

"నిరుద్యోగుల్ని మోసం చేసినందుకు కేసీఆర్ ఓటేస్తారా..? కేబినెట్లో బీసీలకు జరిగిన అన్యాయం ఎంత..? ఐదుగురు రెడ్లు, నలుగురు వెలమలతో సామాజిక న్యాయం చేశావా? సొంత ప్రచారం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదు" అని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.    
 

English Title
Komatireddy Reaction On CM KCR Challange
Related News