కొడంగల్ నాగులాపల్లిలో ఉద్రిక్తత

Kodangal tense as  fight between the TRS and Congress cadre

హైదరాబాద్ : కొడంగల్ నియోజకవర్గం నాగులాపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ నేపథ్యంలో  కాంగ్రెస్, టీఆర్ఎస్  కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన పోలీసులు...పూర్తి స్థాయిలో పహరా నిర్వహిస్తున్నారు. కాగా కొడంగల్ నియోజకవర్గం బరిలో కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి బరిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు