మధ్యంతర ఉత్తర్వులకు నో

Updated By ManamWed, 07/11/2018 - 23:34
supreme-court
  • ఎస్సీ/ఎస్టీలకు పదోన్నతుల్లో  రిజర్వేషన్లపై సుప్రీం వెల్లడి

  • 2006 తీర్పును రాజ్యాంగ ధర్మాసనం పరిశీలించాల్సిందే

supreme-courtఎస్సీ/ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతులు కల్పించేటప్పుడు క్రీమీలేయుర్ వర్తించదన్న పాత తీర్పుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం కుదరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 2006లో ఎం.నాగరాజు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ విషయంతో వెలువడిన ఆ తీర్పును ఏడుగురు న్యాయుమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిందేనని తేల్చి చెప్పింది. రిజర్వేషన్ల అంశంపై నెలకొన్న సందిగ్ధత వల్ల రైల్వే, ఇతర సర్వీసుల్లో లక్షలాది ఉద్యోగాల భర్తీ, ప్రమోషన్లు నిలిచిపోయాయని, దీనిపై తక్షణం మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని బుధవారం కేంద్రం.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయుమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఇప్పటికే రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వేర్వేరు కోర్టుల్లో వచ్చిన భిన్నైమెన తీర్పుల విషయంలో కొన్నింటిని రాజ్యాంగ ధర్మాసనం పరిష్కరించిందని బెంచి వ్యాఖ్యానించింది. ప్రస్తుతానికి ఉన్న చట్టాల ప్రకారం ఉద్యోగాల భర్తీ తదితరాలను చేపట్టవచ్చని పేర్కొంది. అంశాన్ని ఆగస్టు మొదటి వారంలో ఏడుగురు న్యాయుమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని వెల్లడించింది.

English Title
Know the interim orders
Related News