మోకాళ్ళ నొప్పులకు వంటింటి వైద్యం ....!!!

Updated By ManamMon, 08/06/2018 - 16:46
knee join pain

అధిక బరువుతో పాటు, వయసు మీదపడుతుంటే..మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్న సమస్య అందరూ ఎదుర్కొనేదే.  అయితే వయస్సును బట్టి కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ మోకాళ్ల నొప్పులు బారినపడుతున్నారు. ఎముకల్లో బలం తగ్గినా కూడా  కీళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అవుతాయి..ఇలా ఉన్నవారు ప్రతిసారి వైద్యుడి వద్దకు వెళ్లినాప్రయోజనం ఉండదు. అలాంటి వారు ఒకసారి వంటింటి వైద్యన్ని వాడి చూస్తే మంచిది.. ఈ నొప్పులు పోడానికి ఈ చిట్కాలు చూసి తెలుసుకోండి... 

knee pain

1.ఆపిల్ సైడర్ వెనిగర్ 
ఆపిల్ సైడర్ వెనిగర్ శరీరంలో 70 శాతం వ్యాధులకు చెక్ పెడుతుంది. అందులో మోకాళ్ళ నొప్పులను పోగొట్టడానికి  ఇది అద్భుతమైన ఔషధకారి. రోజు రాత్రి పడుకునే సమయంలో ఒక చెంచా వెనిగర్ నీళ్లలో కలుపుకొని తాగాలి. ఇలా ప్రతి రోజు చెయ్యడం వల్ల శరీరంలో ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా బాత్ టబ్‌లో ఒక చెంచా వెనిగర్‌ని కలిపి 20-25 నిమిషాల వరకు అలాగే ఉన్నా మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.

2.అల్లం టీ 
అల్లం టీ కూడా నొప్పులని తగ్గించడానికి సహాయ పడుతుంది. కొంచం అల్లం పొడి తీసుకొని నీటిలో మరిగించి తాగితే మంచిది.ఇలా రోజుకు 2,3 సార్లు తాగితే నొప్పులు లేకుండా ఉంటాయి. కావాలనుకుంటే అందులోకి నిమ్మకాయ, తేనే కలుపుకుని తాగచ్చు. ఇలా రోజు చెయ్యడం వల్ల ఉపశమనం కలుగుతుంది. నొప్పి ఎక్కువైనప్పుడు అల్లం నూనె మోకాలికి పట్టించడం వల్ల ఉపశమనం కలుగుతుంది. 

3.పసుపు 
పసుపు మోకాళ్ల నొప్పులను తగ్గించేందుకు సహాయపడుతుంది. పసుపు కొంచం అల్లం పొడి పాలల్లో వేసి 12-15 నిమిషాల పాటు మరిగించి వాటిని రోజుకు రెండు మూడు సార్లు తాగాలి. నోటికి రుచికరంగా కావాలనుకుంటే తేనే వేసుకోవడం మంచిది. ఇలా చెయ్యడం వల్ల కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

4.నిమ్మకాయ 
నిమ్మకాయతో చాలా సమస్యలకు చెక్ పెట్టవచ్చు. నిమ్మకాయ మోకాళ్ళ వాపుని,నొప్పిని తగ్గిస్తుంది. నిమ్మకాయని చిన్నముక్కల కోసి ఒక గుడ్డలో పెట్టి వెచ్చగా ఉన్న నువ్వుల నూనెలో అద్ది వాపు ఉన్న చోట అయిదు నిమిషాల పాటు పెడితే నొప్పి తగ్గుతుంది. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే వాపు తగ్గుతుంది.

5. మిరపకాయ గింజలు+అలివ్ నూనె 
మిరపకాయలోని గింజలను పొడి చేసి ఆలివ్ నూనెలో వేసి మరిగించక.. ఆ మిశ్రమాన్ని వాపు,నొప్పి ఉన్న చోట మర్దన చేయాలి. ఇలా వారం పాటు రోజుకు రెండుసార్లు చెయ్యడం వల్ల నొప్పి తగ్గుతుంది.. 

English Title
knee joint pain home remedies
Related News