రాజు, రాణి.. ఓ మైఖేల్!

micheal christian
  • ఇంటి నుంచి పారిపోయిన యూఏఈ రాణి

  • గోవా వద్ద పట్టుకున్న భారత కోస్ట్‌గార్డ్

  • తిరిగి స్వదేశానికి అప్పగించిన భారత్

  • ప్రతిఫలంగా మైఖేల్ అప్పగింతకు రాజు చొరవ

  • అదే అదనుగా దౌత్య ప్రక్రియను పెంచిన దోవల్

  • చివరకు భారత్‌కు చేరిన ‘అగస్టా’ మధ్యవర్తి!

న్యూఢిల్లీ: అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభ కోణంలో ముడుపుల మధ్యవర్తిగా భావిస్తున్న క్రిస్టియన్ మైఖేల్‌ను దుబాయ్ అప్పగించిన విషయం తెలిసిందే. అయితే.. మైఖేల్‌ను అప్పగింత వెనుక చాలా పెద్ద కథే ఉంది. నేరస్థుల అప్పగింత విషయంలో భారత్ సాధిం చిన తొలి విజయంగా అభివర్ణిస్తున్నారు. అయితే.. దీని వెనుక విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కృషి ఎంతో ఉందని అంటున్నారు. వారిద్దరి కృషి వల్లే క్రిస్టియన్ మైఖేల్‌ను భారత్‌కు అప్పగించేందుకు దుబాయ్ అంగీకరించిందని అంటున్నారు. అయితే.. దీనికి తోడు దుబాయ్ నుంచి పారిపోయిన ఆ దేశ ప్రధాని కూతురు, యువరాణిని తిరి గి భారత్ అప్పగించిందని, దాంతో క్రిస్టియన్ మైఖేల్‌ను మన దేశానికి అప్పగించేందుకు సహకరించిందని తెలి సింది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాలకుడు, ప్రధాని షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కూతురు షేక్ లతీఫా దేశాన్ని విడిచిపారిపోయేందుకు ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో ఆమె ఒక రోజు ఫ్రాన్స్ అమెరికన్ హార్వే జాబర్ట్‌కు చెందిన బోటులో గోవా దగ్గరకి వచ్చారు. తీరానికి 30 మైళ్ల దూరంలో ఆ బోటును కోస్ట్‌గార్డ్ దళం అడ్డగించింది. ఆమెను బలవంతంగా స్వదేశానికి తిరిగి పంపేసింది. ఈ సహాయానికి గుర్తుగా మైఖేల్ క్రిస్టియ న్‌ను మన దేశానికి అప్పగించేందుకు దుబాయ్ సహకరిం చిందని విశ్వసనీయంగా తెలిసింది. కాగా, ఈ విషయం లో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది.  ఈ మేరకు ‘లైవ్ మింట్’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అజిత్‌దోవల్‌తోపాటు యూఏఈలోని భారత రాయబారి నవ్‌దీప్ సూరి కీలక పాత్ర పోషించారని, దౌత్యమార్గాల ద్వారా మైఖే ల్‌ను భారత్‌కు అప్పగించేలా చర్యలు తీసుకున్నారని తెలిపింది.

కేసు ఇలా మొదలైంది..
రాష్ట్రపతి, ప్రధాని వంటి ప్రముఖులు వినియోగించేం దుకు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కాంపెనీకి చెం దిన హెలికాప్టర్లను కొనాలని ఆనాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2010లో ఒప్పందం కుద రింది. రూ.3,600 కోట్ల వ్యయంతో వీటి కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. అయితే ఈ చాపర్ల కాంట్రాక్టు వెస్ట్ ల్యాండ్‌కు దక్కేలానిబంధనల్లో మార్పులు చేశారని ఆరో పణలు వచ్చాయి. ఈ క్రమంలో సీబీఐ, ఈడీలు రంగం లోకి దిగి 2012లో కేసు నమోదు చేశాయి. ఖజానాకు రూ.2666 కోట్ల మేర నష్టం వాట్లిందని తేల్చింది. ఈ మేరకు 2016లో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ ఒప్పందంలో ట్యునీషియా నుంచి యూఏఈకి నిధులు వెళ్లాయని, మైఖేల్‌కు దుబాయ్‌లో రూ.225 కోట్ల మేర ముడుపులు అందాయని సీబీఐ ఆరోపించింది. దుబాయ్ నివాసి రాజీవ్ సక్సేనాకు చెందిన సంస్థల ద్వారా భార త్‌కు ఆ సొమ్మును  తరలించారని చార్జిషీట్‌లో సీబీఐ ఆరో పించింది.  ఇదే కేసులో వైమానికదళ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగి, ఆయన సమీప బంధువులు సంజీవ్, గౌతమ్ ఖైతాన్, రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జేఎస్ గుజ్రాల్‌తోపాటు 9 మందిపై అభియోగాలు దాఖలయ్యాయి. కుంభకోణం వెలుగు చూడకముందే భారత్‌కు 3 అగస్టా వెస్ట్ల్యాండ్ హెలికాప్టర్లు అందాయి. కేసు నేపథ్యంలో మిగిలిన 9 హెలికాప్టర్ల కొనుగోళ్లను భారత ప్రభుత్వం నిలిపివేసింది. వాస్తవానికి వీవీఐపీల ప్రయాణాల కోసం అప్పటిదాకా వాడుతున్న ఎం-8ల స్థానంలో ఆధునిక హెలికాప్టర్లను కొనుగోలు చేయాలని 1999లో వాజ్‌పేయి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తర్వాత వచ్చిన యూపీఏ ప్రభుత్వం దానికి ముందుకు కొనసాగించి హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి నిబంధనలు సవరించింది. ఆ నిబంధనలు ఇటలీకి చెందిన అగస్టా వెస్ట్‌ల్యాండ్‌కు అనుకూలంగా ఉన్నాయని ఆరోపణలున్నాయి. 

సంబంధిత వార్తలు