ఒంటి చేత్తో కోహ్లీని అవుట్ చేసిన ఖ్వాజా

khawaja

అడిలైడ్‌లో కోహ్లీ బ్యాటింగ్ రికార్డు తొలి రోజే నిష్ప్రయోజనమైంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు తొలి రోజు ఆటలో ఉస్మాన్ ఖ్వాజా స్టన్నింగ్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ తక్కువ పరుగులకే వెనుదిరగాల్సి వచ్చింది. ఇలా నాలుగు పరుగులలోపే కోహ్లీ అవుట్ కావడం ఇది రెండోసారి. గతంలో ఆస్ట్రేలియా జట్టు ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు రాంచీలో జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాగే అవుటయ్యాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు కేఎల్ రాహుల్, మురళీ విజయ్ శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. తర్వాత వచ్చిన కోహ్లీ కూడా ఆదుకోలేకపోయాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ 11వ ఓవర్లో కమ్మిన్స్ వేసిన బంతిని కోహ్లీ డ్రైవ్ షాట్ ఆడాడు. చాలా బలంగానే కొట్టాడు. అయితే ఆ బంతి కోహ్లీ బ్యాట్ అంచును తాకి గల్లీలోకి వెళ్లింది. అక్కడే ఉన్న ఖ్వాజా డైవ్ కొట్టి ఎవ్వరూ ఊహించని క్యాచ్ పట్టాడు. దీంతో టీమిండియా 19 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

సంబంధిత వార్తలు