వావ్.. వాట్ ఎ ట్రైలర్

Updated By ManamFri, 11/09/2018 - 15:13
KGF

KGFప్రముఖ కన్నడ హీరో యశ్ ప్రధానపాత్రలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రం కేజీఎఫ్(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్). కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో రానున్న ఈ చిత్రం డిసెంబర్ 21న విడుదల కానుంది. కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్ర అన్ని భాషల ట్రైలర్లు విడుదల అయ్యాయి.

వాస్తవ సంఘటనల నేపథ్యంలో వచ్చిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్ ట్రైలర్‌కు అస్సెట్‌గా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో యశ్ సరసన శ్రీనిధి శెట్టి నటించగా.. తమన్నా స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని కైకాల సత్యనారాయణ సమర్పణలో సాయి కొర్రపాటి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలాగే తమిళ్‌లో విశాల్, హిందీలో ఫర్హాన్ అక్తర్‌లు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుంటుందో చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

English Title
KGF Trailer talk
Related News